ఇద్దరు ఎంపిల అరెస్టు,ఆత్మరక్షణల్లో టిఎంసి , మమతపై విమర్శల జోరు పెంచిన విపక్షాలు
నల్ల ధనం గురించి మాట్లాడే నైతికహక్కు బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి లేదని సిపిఎం నేతలు విమర్శించారు.
కోల్ కతా :తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపిలను చిట్ ఫండ్ కుంభకోణంలో సిబిఐ అరెస్టుచేయడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. విపక్షాలు బెంగాల్ లో అధికార పక్షంపై ఎదురుదాడికి దిగుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి బుద్దదేబ్ భట్టాచార్య మమతపై నిప్పులు చెరిగారు.
పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆమె ఆందోళనల్లో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న పెద్ద నగదునోట్ల రద్దునిర్ణయాన్ని మమత వ్యతిరేకించడాన్ని ప్రధానమంత్రి మోడీ సహ వామపక్షాల నాయకులు కూడ తప్పుబట్టారు. చిట్ ఫండ్ కుంభకోణంలోనే టిఎంసి ప్రజా ప్రతినిధులున్నారన విషయాన్ని వారు గుర్తుచేశారు.
పెద్ద నగదు నోట్ల రద్దును నిరసిస్తూ మమత బెనర్జీ తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని ఆందోళన చేసింది.అయితే విపక్షాలకు చెందిన పార్టీలన్నీ ఆమెకు మద్దతుగా రాలేదు.

ఓటమి తర్వాత తొలిసారిగా మమతపై మాట్లాడిన బుద్దదేబ్
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లో సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రంట్ కు ఘోరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అతి తక్కువ సీట్లతోనే ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో సిపిఎం ప్రముఖులంతా ఓటమిపాలయ్యారు.అయితే పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టిఎంసి ఆందోళలనలను సిపిఎం తప్పుబట్టింది, చిట్ పండ్ కుంభకోణాల్లో దోచుకొన్న డబ్బును మార్చుకొనే వీలులేకపోయిందనే మమత ఆందోళనలు చేస్తున్నారని బిజెపితో పాటు వామపక్షాలు విమర్శలు గుప్పించాయి.టిఎంసికి చెందిన ఇద్దరు ఎంపిలను సిబిఐ అరెస్టుచేయడంతో తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి బుద్దదేబ్ భట్టాచార్య స్పందించారు. నల్లధనంపై మాట్లాడే హక్కు టిఎంసికి లేదన్నారు.

ఆత్మరక్షణలో టిఎంసి
చిట్ ఫండ్ కుంభకోణాల్లో వారం రోజుల వ్యవధిలోనే టిఎంసి కి చెందిన ఇద్దరు ఎంపిలను సిబిఐ అరెస్టుచేసింది. ఈ అరెస్టులతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. అయితే టిఎంసి అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి బిజెపిపై ఎదురుదాడికి దిగింది. పెద్ద నగదు నోట్ల రద్దుపై తాను ఆందోళన చేస్తోన్నందుకే ఉద్దేశ్యపూర్వకంగానే తమ పార్టీ ఎంపిలను ఈ కేసుల్లో సిబిఐతో అరెస్టుచేయిస్తోందని టిఎంసి అరోపిస్తోంది.ఈ కేసులు టిఎంసిని ఆత్మరక్షణల్లో పడేశాయి.

ప్రధానమంత్రి లక్ష్యంగా మమత పోరాటాలు
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని టిఎంసి అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పోరాటాలుచేశారు.అయితే ఈ పోరాటాలపై బిజెపి నాయకులు కూడ తీవ్రంగానే స్పందించారు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు కూడ ముఖ్యమంత్రి మమతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.విపక్షపార్టీలకు చెందిన నాయకులను కూడ కూడగట్టేందుకు మమత ప్రయత్నించి వైఫల్యం చెందారు.కాంగ్రెస్ పార్టీ విపక్షపార్టీలను కూడగట్టి ఆందోళనలను సిద్దమైంది. ఈ సమావేశానికి మమత హజరయ్యారు.

కుంభకోణాల్లో టిఎంసి నాయకులదే పాత్ర . విపక్షాలు
బెంగాల్ లో చోటుచేసుకొన్న పలు చిట్ ఫండ్ కుంభకోణాల్లో టిఎంసి నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.చిట్ ఫండ్ కంపెనీల నుండి డబ్బులను దోచుకొంటున్నట్టుగా టిఎంసికి చెందిన ప్రముఖులపై ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల ఆధారంగా ఇప్పటికే ఇద్దరు ఎంపిలను సిబిఐ అరెస్టుచేసింది. శారద, నారద, రోజ్ వ్యాలీ లాంటి కేసుల్లో టిఎంసి నాయకులేయ పాత్ర దారులుగా ఉన్నారని ఆ రాష్ట్రానికి చెందిన సిపిఎం, బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

చిట్ ఫండ్ కుంభకోణాలు రాజకీయంగా నష్టమేనా
బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండో దఫా మమత బెనర్జీ బాద్యతలను స్వీకరించారు.అయితే ఆమెపై అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు.అయితే ఆ పార్టీకిచెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులపై చిట్ ఫండ్ కుంభకోణాలతో పాటు ఇతర ఆర్థిక నేరాల ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాన్ని పదేపదే విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి.ఈ తరుణంలో చిట్ ఫండ్ కుంభకోణాల్లో టిఎంసి కి చెందిన ఇద్దరు ఎంపిలను అరెస్టుచేయడం రాజకీయంగా కొంత మమత ప్రతిష్లను దెబ్బతీసే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications