మోడీజీ రాజధర్మం పాటించండి-వాజ్ పేయి సలహాను గుర్తుచేసిన తృణమూల్ మంత్రి..

ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్ లో మూడు నెలల క్రితం మొదలైన సామాజిక వర్గాల పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతే కాదు ఈ అల్లర్లను అడ్డుపెట్టుకుని గతంలో జరిగిన అకృత్యాలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో కేంద్రంతో పాటు మణిపూర్ ప్రభుత్వం కూడా ఇరుకునపడుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విపక్షాలు ఇప్పుడు కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇదే క్రమంలో పశ్చిమబెంగాల్ మంత్రి ఒకరు మాజీ ప్రధాని వాజ్ పేయి గతంలో గుజరాత్ సీఎంగా ఉండగా నరేంద్రమోడీకి చేసిన సూచనను మరోసారి గుర్తుచేశారు.

తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత, పశ్చిమ బెంగాల్ మంత్రి శశి పంజా ఇవాళ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 'రాజ్ ధర్మ' సలహాను మరోసారి ప్రధాని మోడీపై ప్రయోగించారు. మణిపూర్‌లో రెండు నెలలుగా అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో మౌనంగా ఉంటున్న ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ గతంలో వాజ్ పేయి ఇదే నరేంద్రమోడీకి ఇచ్చిన సలహాను ఆయన గుర్తుచేశారు. గుజరాత్ అల్లర్ల తర్వాత ప్రధాని మోదీకి వాజ్‌పేయి ఇచ్చిన 'రాజ్ ధర్మ' సలహాను ప్రస్తావించారు. మణిపూర్ ముఖ్యమంత్రికి కూడా అదే చెప్పారా అని ప్రశ్నించారు.

tmc minister reminds Vajpayees raj dharma advice to pm modi on manipur incidents

మణిపూర్‌కు బాధ్యులెవరు? మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి 'రాజ ధర్మం' పాటించమని చెప్పారు. అదే మణిపూర్ సీఎంకు చెప్పారా? అని బెంగాల్ మంత్రి ప్రశ్నించారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసపై బెంగాల్ మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. మణిపూర్ హింసపై ప్రధాని మోడీ ముందు నుంచీ మౌనంగా ఉంటున్నారు. రాష్ట్రంలో కూడా పర్యటించలేదు. దీంతో విపక్షాలు ఆయన్ను పదే పదే టార్గెట్ చేస్తున్నాయి.

గతంలో గుజరాత్ అల్లర్ల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ హింసను అరికట్టే విషయంలో మౌనంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.దీంతో ప్రధానిగా ఉన్న వాజ్ పేయ్ ఆయన్ను రాజధర్మం పాటించాలంటూ సుతిమెత్తగా చురకలు అంటించారు. అయినా మోడీ మాత్రం తన పని తాను చేసుకుపోయారు. కానీ ఇప్పుడు అదే రాజధర్మం డైలాగ్ ను బెంగాల్ మంత్రి ఆయనపై ప్రయోగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+