రేప్ చేయిస్తానన్న టిఎంసి ఎంపి భార్య క్షమాపణలు
హైదరాబాద్: సిపిఎం నేతల భార్యలపై అత్యాచారం చేయిస్తానని వ్యాఖ్యానించిన తృణమూల్ కాంగ్రెసు పార్లెంటు సభ్యుడు తపస్ పాల్ భార్య స్పందించారు. తపస్ పాల్ వ్యాఖ్యలకు ఆమె క్షమాపణలు చెప్పారు. తపస్ పాల్ ఆగ్రహం తెచ్చుకోకుండా ఉండాల్సిందని ఆమె వ్యాఖ్యానించారు.
వాడిగా వేడిగా వాగ్వివాదం జరిగిందని నందిని పాల్ మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆ సమయంలో తపస్ పాల్ ఆ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో సోమవారం వెలుగు చూసింది.

లోకసభ ఎన్నికల సందర్భంగా ఆ ప్రసంగం నడియాలోని చౌమహా గ్రామంలో చేసిందని చెబుతున్నారు. ఎవరైనా తమను వ్యతిరేకిస్తే తమవారిని ఇళ్లకు పంపించి వారి భార్యలపై అత్యాచారం చేయిస్తానని నటుడు కూడా అయిన తపస్ పాల్ వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, వ్యాఖ్యలపై వివరణ అడగాడనికి తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications