సాగరిక ఘోష్‌కు రాజ్యసభ సీటు ప్రకటించిన టీఎంసీ
కోల్‌కతా: రాజ్యసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(TMC) తమ పార్టీ తరపున అభ్యర్థులను ఖరారుచేసింది. జర్నలిస్టు సాగరిక ఘోష్ (Sagarika Ghose), టీఎంసీ నేత సుస్మితా దేవ్, మరో ఇద్దరి పేర్లను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదకిగా వెల్లడించింది.
'రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులుగా సాగరిక ఘోష్, సుస్మితా దేవ్, మహ్మద్ నదిముల్ హక్, మమతా ఠాకూర్‌లను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. వారందరికీ శుభాకాంక్షలు. టీఎంసీ తరపున ఎన్నకైన వీరంతా భారతీయుల హక్కుల కోసం వాదించే మా పార్టీ వారసత్వాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాం' అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేసింది.

ఈ టీఎంసీ ట్వీట్‌ను సాగరిక ఘోష్ రీట్వీట్ చేశారు. సాగరిక ఘోష్ ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ సతీమణి కావడం గమనార్హం. ప్రఖ్యాత మీడియా సంస్థల్లో పనిచేసిన సాగరిక ఘోష్.. జర్నలిజంలో అనేక అవార్డులు అందుకున్నారు. పలు పుస్తకాలు కూడా రాశారు. అయితే, సాగరిక ఘోష్‌కు రాజ్యసభ సీటు ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో జర్నలిస్టులు ఏ రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండకూడదని సాగరిక ఘోష్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె ఓ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
We are pleased to announce the candidature of @sagarikaghose, @SushmitaDevAITC, @MdNadimulHaque6 and Mamata Thakur for the forthcoming Rajya Sabha elections.
— All India Trinamool Congress (@AITCofficial) February 11, 2024
We extend our heartfelt wishes to them and may they work towards upholding Trinamool’s enduring legacy of indomitable…
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఖాళీ అయ్యే 56 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, పశ్చిమ బెంగాల్‌లో 5 స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. ఫిబ్రవరి 8 నుంచి రాజ్యసభ ఎన్నికలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 15 దరఖాస్తుల స్వీకరణ ముగియనుండగా, ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదలవుతాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications