తృణమూల్ అఖండ విజయం - ఎన్నికల్లో క్లీన్ స్వీప్ : బీజేపీకి ఒక్కటీ దక్కలేదు..!!

బెంగాల్ లో ఇంకా మమతా హవా కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి పది నెలలు అయినా..ఇంకా అదే వేవ్ కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తియన పది నెలల తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన 108 మున్సిపాలిటీలలో 102 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 77 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని బంగాల్​లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన భాజపా.. ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకోయింది. కాంగ్రెస్ కు సైతం ఒక్క సీటు దక్కలేదు. 27మున్సిపాలిటీలలో విపక్షాలు అసలు ఖాతాలే తెరవలేదు.

టీఎంసీ ఏకపక్ష విజయం

టీఎంసీ ఏకపక్ష విజయం

ఈ మున్సిపాలిటీలలోని అన్ని వార్డులను అధికార టీఎంసీ గెలుచుకుంది. భాజపా నేత సువేందు అధికారి కంచుకోట అయిన కంతి మున్సిపాలిటీ పైనా టీఎంసీ జెండా ఎగిరింది. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ సువేందు అధికారి కుటుంబమే అధికారం చెలాయిస్తోంది. ఈ ఫలితం.. సువేందు పట్టుకు గట్టి షాక్ గా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక, మమతను దెబ్బ తీయాలని భావిస్తున్న బీజేపీ కనీస పోటీ ఇవ్వలేక పోయింది. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే సమయంలో ఓ సరికొత్త రాజకీయ పార్టీ అనూహ్య ఫలితాన్ని సాధించింది.

కొత్త పార్టీ ఒక్క మున్సిపాల్టీ

కొత్తగా ఏర్పాటైన హమ్రో పార్టీ.. డార్జీలింగ్ మున్సిపాలిటీని దక్కించుకుంది. 'గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్' మాజీ నేత, స్థానిక రెస్టారెంట్ యజమాని అజోయ్ ఎడ్వర్డ్స్ ఈ పార్టీని స్థాపించారు. డార్జీలింగ్​లో ఆధిపత్యం సాగించే గూర్ఖా జన్ముక్తి మోర్చా, టీఎంసీ, భాజపాలను ఓడించి.. మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.సీపీఎం ఆధ్వర్యంలోని వామపక్ష కూటమి తహెర్పుర్ మున్సిపాలిటీలో విజయం సాధించింది. మిగిలిన నాలుగు మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. ఇక్కడి ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.

Recommended Video

    Third Front: Tejaswi Yadav Meets CM KCR| 2024 Elections | BJP | Oneindia Telugu
    మమతా ఫుల్ భ్యాపీ

    మమతా ఫుల్ భ్యాపీ

    కాగా, ఎన్నికలకు ముందే ఓ స్థానాన్ని టీఎంసీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం పట్ల టీఎంసీ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. అనూహ్య మెజారిటీతో గెలిపించినందుకు.. ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ విజయంతో తమ బాధ్యత పెరిగిందన్నారు. మరింత అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి సుస్థిరతలు పెంపొందించి, అభివృద్ధి కోసం అందరూ కలిసి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలతో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా జరిగిందని భాజపా మండిపడింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+