సీఎం అంటే ఇలానే ఉండాలి, సూపర్, పగ తీర్చుకుంటే ఫలితం ఉండదు బ్రో !

చెన్నై/విజయవాడ/ బెంగళూరు: సర్వసాధారణంగా ప్రభుత్వాలు మారిన సమయంలో, వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు అధికార పార్టీ నాయకులకు చెందిన పేర్లు పెట్టుకోవడం, లేదంటే గత ప్రభుత్వంలోని ఆ పథకాలను పూర్తి తెరమరుగు చేసి వారి పేరు వినపడకుండా అధికార పార్టీలు చేసిన సంఘటనలు చాలానే మనం చూశాము. రాజకీయంగా ఇలాంటి ప్రతీకార చర్చలు జరుగుతూనే ఉంటాయి.

అయితే ప్రతిపక్ష పార్టీ ప్రవేశపెట్టిన పథకం కొనసాగించడానికి గతంలో ఇచ్చిన నిధుల కంటే ఇంకా ఎక్కువ కోట్లు నిధులు కేటాయించిన సీఎం అందరి దగ్గర సూపర్ సీఎం అనిపించుకుంటున్నారు. నిరుపేదలు. కూలీలు, కార్మికులకు, భిక్షగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత పేరుతో కొనసాగుతున్న ఆ పథకం పేరుకూడా మార్చకుండా ఇంకా ఎక్కువ పాపులర్ కావాలని ఓ సీఎం ప్రయత్నించడం హాట్ టాపిక్ అయ్యింది.

 MK Stalin

తమిళనాడులో జయలలిత పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అమ్మా క్యాంటిన్లు ప్రారంభించారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో అమ్మా క్యాంటిన్లు కలకలలాడిపోయాయి. తరువాత తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి రావడంతో ఎంకే. స్టాలిన్ సీఎం అయ్యారు. స్టాలిన్ సీఎం అయిన తరవాత అమ్మా క్యాంటీన్లు కచ్చితంగా మూతపడుతాయని అన్నాడీఎంకే నాయకులు అనుకున్నారు.

 MK Stalin

అయితే అందరి అంచనాలు తారుమారు చేసిన ఎంకే. స్టాలిన్ సొంత పార్టీ నాయకులు అభ్యంతరం చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుండా రాజకీయ ప్రత్యర్థి అయిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరుతో ఉన్న అమ్మా క్యాంటీన్లు కొనసాగించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు అమ్మా క్యాంటీన్లు మరింత ఆకర్షణగా ఉండటానికి, నాణ్యమైన ఆహారం అందించడానికి రూ. 9 కోట్ల నిధులు అమ్మా క్యాంటీన్లకు కేటాయించిన డీఎంకే ప్రభుత్వం అందరికి షాక్ ఇచ్చింది.

చెన్నైలో అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం కొంతకాలం క్రితం డీకేఎంకే ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శించారు. అమ్మా క్యాంటీన్లలో సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నదని, ఉదయం, మద్యాహ్నం, రాత్రి పేదలకు అందించే ఆహార నిల్వలు సరిపోవడం లేదని, ఫర్నీచర్ కూడా సక్రమంగా లేదని, కనీస సౌకర్యాలు లేవని అన్నాడీఎంకే పార్టీ నాయకులు ఆరోపించారు.

 MK Stalin

ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు చెక్ పెట్టాలని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ సరైన నిర్ణయం తీసుకున్నారు. అమ్మా క్యాంటీన్లను కొనసాగించాలనే డీఎంకే పార్టీ నిర్ణయానికి అనుగుణంగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ జోనల్ స్థాయిలో పునరుద్ధరణ పనుల కోసం రూ. 9 కోట్ల రూపాయలను కేటాయించింది. గతేడాది కంటే అదనంగా రూ.4. 5 కోట్లు ఇచ్చారు. అమ్మా క్యాంటీన్లను పరిశీలించిన చెన్నై డిప్యూటీ మేయర్ ఎం.మగేష్ కుమార్ ఈ విషయాన్ని తెలియజేశారు.

చెన్నై కార్పొరేషన్ లెక్కల ప్రకారం 2022-23లో అమ్మా క్యాంటీన్ల ద్వారా వచ్చే ఆదాయం రూ.15. 8 కోట్లు మాత్రమే కాగా, ఖర్చు దాదాపు రూ. 97.8 కోట్లు. అమ్మా క్యాంటీన్ల ద్వారా నష్టపోయినప్పటికీ, క్యాంటీన్లు ద్వారా పేద ప్రజలకు సేవ చేయాలనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయించారని, సీఎం కోరిక మేరకు అమ్మా క్యాంటీన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెన్నై డిప్యూటీ మేయర్ మగేష్ కుమార్ అన్నారు.

అమ్మా మొబైల్ క్యాంటీన్ల ద్వారా గత ఏడాది 1. 09 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందారని మగేష్ కుమార్ తెలిపారు. ఇటీవల తేనాంపేట మండలంలో అమ్మ క్యాంటీన్లపై ఆడిట్ కమిటీ చైర్మన్ కె.ధణశేఖరన్ ఆడిట్ నిర్వహించారు. అక్కడ 2020-21లో 38 క్యాంటీన్లను నడపడానికి రూ. 9. 5 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అంటే అమ్మా క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం 1. 55 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుందని, అమ్మా క్యాంటీన్లు నిర్వహించడానికి సుమారు రూ. 100 కోట్లు ఖర్చు అవుతోందని చెన్నై కార్పోరేషన్ అంటోంది.

 MK Stalin

సీఎం స్టాలిన్ ఆదేశాల నేపథ్యంలో సైదాపేట, టీ. నగర్‌లోని ఆరు అమ్మ క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ మేయర్ ఎం.మగేష్ కుమార్ మాట్లాడుతూ 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు 5. 3 కోట్ల మంది క్యాంటీన్ల ద్వారా లబ్ధి పొందారని తెలిపారు. వాటిలో 6. 7 శాతం అమ్ముడయ్యాయి.

ఈ మధ్య కాలంలో కోటి ఇడ్లీలు, 1. 53 కోట్ల బియ్యం ప్యాకెట్లు, 2. 65 కోట్ల చపాతీలు అమ్ముడయ్యాయని వివరించారు. ఎంత నష్టం వచ్చినా అమ్మా క్యాంటీన్లను కొనసాగించాలని సీఎం స్టాలిన్ సూచించారని, ఆ దిశగా తాము నిధులు కేటాయిస్తున్నామని చెన్నై డిప్యూటీ మేయర్ మగేష్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆయన మార్క్ రాజకీయాలు చేస్తున్నారు.

సీఎం అంటే ఇలానే ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ప్రజల దగ్గర, ప్రతిపక్షాల దగ్గర మంచి మార్క్ లు కొట్టేశారు. సీఎం అంటే ప్రజల కోసం పని చెయ్యాలని, ప్రత్యర్థి పార్టీల మీద పగ తీర్చుకోవాలని వాళ్లు ప్రవేశ పెట్టిన పథకాలు నిలపలేదని తమిళనాడు ప్రజలు అంటున్నారు. గతంలో ఇలాంటి ప్రభుత్వ క్యాంటీన్లను ఇతర పార్టీలను అధికారంలోకి వచ్చిన తరువాత వాటికి నిలిపివేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+