పన్నీర్ సెల్వంకు కీలక పదవి, ఆయన వర్గం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, ఓకే నా ? సీబీఐతో !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గం నాయకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గురువారం ఎడప్పాడి పళనిసామి వర్గం నాయకులు పన్నీర్ సెల్వం వర్గంతో విలీనం అయితే మనకే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గం నాయకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గురువారం ఎడప్పాడి పళనిసామి వర్గం నాయకులు పన్నీర్ సెల్వం వర్గంతో విలీనం అయితే మనకే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చారు.

అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ నుంచి టీటీవీ దినకరన్ ను బహిష్కరిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను పార్టీ నుంచి బహిష్కరించే విషయంలో జోరుగానే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పన్నీర్ సెల్వంతో విలీనం కావాలని చర్చ జరిగింది.

TN CM Palanisamy is in Party Office to discuss various issues including AIADMK merger.

పన్నీర్ సెల్వం వర్గంలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, అన్నాడీఎంకే పార్టీ అడ్వజరీ కమిటీ కార్యదర్శి పదవి పన్నీర్ సెల్వంకు ఇవ్వాలని పలువురు సీనియర్ మంత్రులు సీఎంతో చర్చించారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పళనిసామి ప్రతిపాదనలకు పన్నీర్ సెల్వం అంగీకరిస్తారా ? అనే విషయం వేచిచూడాలి.

గురువారం చెన్నైలో పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నేత, మాజీ మంత్రి కేపీ. మునిస్వామి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా పళనిసామి వర్గం కళ్లు తెరచి టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అదే విధంగా జయలలిత మరణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యాలని కేపీ. మునిస్వామి డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+