సీఎం పళనిసామిని జైలుకు పంపిస్తా: నా సత్తా చూపిస్తా, మన్నార్ గుడి మాఫియా సవాల్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని త్వరలోనే జైలుకు పంపిస్తానని అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన టీటీవీ దినకరన్ చాలెంజ్ చేశారు. శనివారం చెన్నైలో దినకరన్ తన వర్గీయులతో కలిసి సమావేశం అయ్యారు.

షాక్: జైల్లో చిప్పకూడు తినడానికి సిద్దంగా ఉండు: దినకరన్ కు సీఎం పళనిసామి వార్నింగ్ !

తన వర్గం నేతలకు పలు సూచనలు సలహాలు ఇచ్చిన టీటీవీ దినకరన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను జైలుకు పంపిస్తానని చెబుతున్న సీఎం పళనిసామి అంతకంటే ముందుగానే ఆయన్ను తానే జైలుకు పంపిస్తానని, ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని టీటీవీ దినకరన్ గుర్తు చేశారు.

TN CM Palanisamy will go to prison says TTV Dinakaran

ఇప్పటికే తాను ఎక్కడ జైలుకు వెలుతానో అంటూ పళనిసామి భయపడిపోతున్నారని దినకరన్ చెప్పారు. జయలలిత అధికారంలోకి తెచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని శశికళ కుటుంబ సభ్యులు పడగొట్టాలని చూస్తున్నారని, అందుకే 18 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దినకరన్ రిసార్ట్ రాజకీయం చేస్తున్నాడని పళనిసామి ఆరోపించారు కదా అని మీడియా ప్రశ్నించగా దినకరన్ అసహనం వ్యక్తం చేశారు.

స్పీకర్, పళని, పన్నీర్ భేటీ: రెబల్ ఎమ్మెలేల మీద అనర్హత వేటు ? టెన్షన్ తో రిసార్ట్ లో టీవీ !

తనకు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని పళనిసామి, పన్నీర్ సెల్వం ఆరోపిస్తారని ఆ మాటలు తమిళనాడు ప్రజలు నమ్మరని టీటీవీ దినరన్ చెప్పారు. సీఎం అవినీతిపరుడని, తాను అవినీతిపరుడు కాదని ఇదే సందర్బంలో చెప్పిన టీటీవీ దినకరన్ సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran told that press person, Edapadi Palanisamy will go to prison, i am not a corruption man he added.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి