శేఖర్ రెడ్డి మాయ: రాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రత్యేక పాస్, ఎలా వచ్చింది ?
అక్రమ నగదు వ్యవహారాలకు పాల్పడ్డారని, ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని సీబీఐ అరెస్టు చేసిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి వ్యవహారం మళ్లి రచ్చరచ్చ అయ్యింది.
చెన్నై: అక్రమ నగదు వ్యవహారాలకు పాల్పడ్డారని, ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని సీబీఐ అరెస్టు చేసిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి వ్యవహారం మళ్లి రచ్చరచ్చ అయ్యింది. ఈనెల 25వ తేదీ న్యూఢిల్లీలో రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి శేఖర్ రెడ్డి హాజరైనాడని, ఆయనకు ప్రత్యేకంగా పాస్ మంజూరు చేశారని శనివారం వెలుగు చూసింది. అక్రమాస్తులు, అక్రమలావాదేవీలు నిర్వహించడంతో సీబీఐ అధికారులు శేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

శేఖర్ రెడ్డి కేసులు ఇప్పటికీ విచారణలో ఉన్నాయి. అలాంటి శేఖర్ రెడ్డికి రాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ఫోటోలో లేకుండా ఎవరు ప్రత్యేక పాస్ ఇప్పించారు ? అది ఎలా సాధ్యం అయ్యింది ? అనే విషయం అర్థకావడం లేదు.
See here pic.twitter.com/J3JqXxi1QJ
— Manoj Prabakar S (@imanojprabakar) July 28, 2017
తమిళనాడు ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా శేఖర్ రెడ్డి రాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని ఆరోపణలు ఉన్నాయి. శేఖర్ రెడ్డికి మంజూరు అయిన పాస్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేరం చేసిన వారిని నెత్తిన పెట్టుకుంటారని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.












Click it and Unblock the Notifications