టీటీవీ దినకరన్ దెబ్బ: మంత్రి తండ్రికి ఐటీ శాఖ సమన్లు, ఇక పనికిరాడు !
తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ తండ్రి చినతంబి, ఆయన సోదరుడు ఉదయ్ కుమార్ కు ఐటీ శాఖా అధికారులు సమన్లు జారీ చెయ్యడంతో శనివారం తిరుచ్చిలోని ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు వారిద్దరూ హాజరైనారు.
నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి సి. విజయభాస్కర్ కు కష్టాలు మొదలైనాయి. శుక్రవారం మంత్రి విజయభాస్కర్ ఇంటిలో దాడులు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు నగదు, నగలు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

ఇదే సమయంలో మంత్రి విజయభాస్కర్ అనుచరులు, బంధువులు, కుటుంబ సభ్యుల నివాసాల్లో 21 చోట్ల ఒకే సారి ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికే మాజీ మంత్రి పన్నీర్ సెల్వం, బీజేపీ కలిసి మా ఇంటి మీద ఐటీ శాఖ అధికారులతో దాడులు చేయించారని మంత్రి విజయభాస్కర్ మీడియా ముందు ఆరోపించారు.
ఐటీ శాఖ అధికారులు మంత్రి విజయభాస్కర్ తండ్రి చినతంబి, ఆయన సోదరుడు ఉదయ్ కుమార్ కు సమన్లు జారీ చేశారు. శనివారం తిరుచ్చిలోని ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు మంత్రి విజయభాస్కర్ తండ్రి చినతంబి, ఆయన సోదరుడు ఉదయ్ కుమార్ హాజరైనారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు చినతంబి, ఉదయ్ కుమార్ లను విచారించి వివరాలు సేకరించారు. ఐటీ శాఖ సోదాలకు గురైన ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ను వెంటనే పదవి నుంచి తప్పించాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్, పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాందాస్ వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications