వీడు మామూలోడు కాదు!?: ఏకంగా 8పెళ్లిళ్లు, రూ.4.5కోట్లు కాజేశాడు

Subscribe to Oneindia Telugu

చెన్నై: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు ఈ ప్రబుద్ధుడు. అంతేగాక, ఆ మహిళల నుంచి రూ.4.5 కోట్లు వసూలు చేసుకుని మోసం చేశాడు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో ఆ నిందితుడి కోసం విస్తృత గాలింపు చేపట్టారు పోలీసులు.

చెన్నైలోని ఇందిరా గాంధీ(45) అనే లెక్చరర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇలాంటి మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

వారినే లక్ష్యంగా..

వారినే లక్ష్యంగా..

వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్‌లోని వెల్లలూర్‌కు చెందిన బి.పురుషోత్తమన్‌ (57 లారీల వ్యాపారం చేస్తుండేవాడు. ఆయన భార్య ఉషారాణి చాలా ఏళ్ల క్రితమే మరణించింది. వీరికి ప్రస్తుతం 18 ఏళ్ల కుమార్తె ఉంది. కాగా, కోయంబత్తూర్‌లో పెళ్లి సంబంధాల ఏజెన్సీ నిర్వహించే మోహన్‌, వనజ కుమారిలతో పరిచయం పెంచుకున్నాడు. విడాకులు తీసుకున్నవారు, వితంతువులను లక్ష్యం చేసుకున్నాడు.

  Big News Big Bite : Today Trending News
  కోట్లు చేతిలో పెడితే..

  కోట్లు చేతిలో పెడితే..

  మొదట మాయమాటలు చెప్పి ఇందిరా గాంధీ అనే మహిళను పెళ్లాడాడు. ఆమెకు చెన్నైలో ఇల్లు ఉండటంతో దాన్ని అమ్మివేసి కోయంబత్తూర్‌లో కొనుగోలు చేయాలని చెప్పాడు. నిజమే అన్ని నమ్మి దాన్ని రూ.1.5 కోట్లకు అమ్మి అతని చేతిలో పెట్టింది. అప్పట్నుంచి మళ్లీ అతడు కనిపించలేదు. ఎలాంటి ఆధారంలేని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

  తెల్లబోయిన బాధితురాలు

  తెల్లబోయిన బాధితురాలు

  కాగా, పురుషోత్తమన్‌ ముందు ముగ్గుర్ని, ఆ తరువాత మరో నలుగుర్ని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొన్న ఆమె తెల్లబోయింది. కుముదవల్లి అనే మహిళలను కూడా ఇదే విధంగా పెళ్లాడి మోసగించాడు.

  మరో మహిళ రూ.3కోట్ల టోకరా

  మరో మహిళ రూ.3కోట్ల టోకరా


  రూ.17 కోట్ల ఆస్తి వివాదం కోర్టులో ఉందని, అంతవరకు డబ్బు సర్దమని కుముదవల్లిని కోరాడు. గుడ్డిగా నమ్మిన ఆమె తనకున్న పొలాలను రూ.3 కోట్లకు అమ్మి అతని చేతిలో పెట్టింది. ఇంకేముంది ఆ తర్వాత నుంచి ఆమెకు కనిపించలేదు. కాగా, నిందితుడిపై ఇప్పటికే 18 మోసం కేసులు నమోదయి ఉన్నాయని పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మసుతా బేగం చెప్పారు. బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Perhaps his truck transport business was not doing too well. So B Purushothaman of Vellalore in Coimbatore district of Tamil Nadu decided to make marrying an enterprise.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి