విలీనం చర్చలు మొదలైనాయి, జయలలిత ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు !
అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాల విలీనం చర్చలు ఇప్పటికే మొదలైనాయని తమిళనాడు మంత్రి ఆర్.బి. ఉదయ్ కుమార్ చెప్పారు. బుధవారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే విలీనం చర్చలు ఎమైనాయి ?
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాల విలీనం చర్చలు ఇప్పటికే మొదలైనాయని తమిళనాడు మంత్రి ఆర్.బి. ఉదయ్ కుమార్ చెప్పారు. బుధవారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే విలీనం చర్చలు ఎమైనాయి ? ఎప్పుడు మొదలు పెడుతారు ? అని మీడియా ప్రశ్నించింది.
ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గంతో చర్చలు మొదలైనాయని, అయితే విలీనం ఎప్పుడు అయ్యే విషయంపై ఓ తేదీని ఇంకా ఖరారు చెయ్యలేదని మంత్రి ఉదయ్ కుమార్ అన్నారు. రెండు వర్గాలు కలిసిపోతే తమిళనాడు ప్రజలకు మరింత సేవ చెయ్యడానికి అవకాశం ఉంటుందని ఉదయ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చడం ఎవ్వరి తరం కాదని మంత్రి ఆర్.బి. ఉదయ్ కుమార్ పరోక్షంగా టీటీవీ దినకరన్ ను హెచ్చరించారు. జయలలిత అధికారంలోకి తీసుకు వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, అధి సాధ్యం కాదనే విషయం గుర్తు పెట్టుకుంటే అందరికీ మంచిదని టీటీవీ దినకరన్ వర్గీయులను మంత్రి ఉదయ్ కుమార్ సూచించారు.












Click it and Unblock the Notifications