1957 నుంచి 12సార్లు గెలిచిన కరుణానిధి, రికార్డ్
చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అరుదైన రికార్డ్ తన పేరిట లిఖించుకున్నారు. మే 16వ తేదీన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 92 ఏళ్ల కరుణానిధి పోటీ చేస్తున్నారు.
ఈసారి డీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి కరుణానిధియే. ఇప్పటి వరకు ఆయన అయిదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం అతను తిరువూరు నుంచి బరిలోకి దిగారు. 2011లోను అతను ఇక్కడి నుంచే పోటీ చేసి 50,249 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కరుణానిధి 12 ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క దాంట్లోను ఓడిపోకుండా రికార్డ్ సృష్టించారు. తొలిసారి 1957లో కరుణానిధి పోటీ చేశారు. అప్పుడు, తన 33 ఏళ్ల వయస్సులో కులితలై నుంచి కరుణ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన పోటీ చేసిన 12 ఎన్నికల్లోను గెలిచారు.
గత 12సార్లు కరుణానిధి పోటీ చేసిన నియోజకవర్గాలు ఇవే..
1957లో కరుణానిధి కులిత్తలై నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఏ ధర్మలింగంను 8,296 ఓట్లతో ఓడించారు.
1962లో తంజావూరు నుంచి పోటీ చేశారు. 20,482 ఓట్ల తేడా

1971లో సైదాపేట నుంచి పోటీ చేశారు. 12,511 ఓట్లతో కాంగ్రెసక్ పార్టీ అభ్యర్థి కామలింగంను ఓడించారు.
1977లో అన్నానగర్ నుంచి పోటీ చేశారు. 16,438 ఓట్లతో అన్నాడీఎంకే అఏభ్యర్థి జీ కృష్ణమూర్తిని ఓడించారు.
1980లో అన్నానగర్ నుంచి మరోసారి పోటీ చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి హెచ్‌వీ హాండేను 699 ఓట్ల తేడాతో ఓడించారు.
1984లో కరుణానిధి పోటీ చేయలేదు.
1989లో హార్బర్ నుంచి పోటీ చేశారు. ముస్లీం లీగ్ అభ్యర్థి కేఏ వాహబ్ పైన 31,991 ఓట్లతో గెలుపొందారు.
1991లో హార్బర్ నుంచి పోటీ చేశారు. 890 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కే సప్పును ఓడించారు.
1996లో చెపాక్ నుంచి పోటీ చేశారు. 35,784 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎస్సెస్ నెల్లై కన్నన్‌ను ఓడించారు.
2001లో చెపాక్ నుంచి మరోసారి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ దామోదరన్‌ను 4,834 ఓట్ల తేడాతో ఓడించారు.
2006లో చెపాక్ నుంచి పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థి డీ మిఖాన్‌ను 8,526 ఓట్ల తేడాతో ఓడించారు.
2011లో తిరువూర్ నుంచి పోటీ చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి ఎం రాజేంద్రన్‌ను 50,249 ఓట్ల తేడాతో ఓడించారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications