వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి రావడం కోసమే సినిమాల్లోకి, ఓ నాటకం నన్ను మార్చేసింది: ఉపేంద్ర

తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశంతోనే మొదట సినీరంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశంతోనే మొదట సినీరంగంలోకి అడుగుపెట్టానని అన్నారు కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర. రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు శనివారం మీడియాకు ఉపేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అసలు తాను సినిమాల్లోకి వచ్చిందే ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు అని రియల్ స్టార్ ఉపేంద్ర పేర్కొన్నారు.

సినిమాల్లోకి వచ్చిందే అందుకు...

సినిమాల్లోకి వచ్చిందే అందుకు...

మొదటి నుంచీ మీ సినిమాలు కానీ లేదా మీరు చేసే ట్వీట్స్ కానీ, అలాగే మీ ఆలోచనలు కానీ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నట్టు ప్రతిబింభించేవిగానే ఉన్నాయి కదా.. మరి అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో మీలో మొదటిసారిగా ఎప్పుడు కలిగింది అని అడగ్గా.. 'అసలు తాను సినిమాల్లోకి వచ్చిందే ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు' అని చెప్పారు ఉపేంద్ర.

చిన్నతనంలోనే బీజం...

చిన్నతనంలోనే బీజం...

తన చిన్నతనంలోనే తనలో ఈ ఆలోచనలకి బీజం పడిందని, తనది విప్లవ భావజాలమని, కానీ ఎవ్వరూ తన మాట వినిపించుకునే వాళ్లు కాదని చెప్పారు ఉపేంద్ర. తానూ వాళ్లలో ఒకరిలాంటోడినే కాబట్టి అప్పట్లో తాను చెప్పింది వినిపించుకునేవాళ్లు కాదని తనకు అర్థమైందని ఆయన పేర్కొన్నారు.

ఓ మాధ్యమం అవసరం ఏర్పడింది అప్పుడే...

ఓ మాధ్యమం అవసరం ఏర్పడింది అప్పుడే...

అప్పుడే తన ఆలోచనలని నలుగురికి చెప్పడానికి ఓ బలమైన మాధ్యమం అవసరమైందని, అందుకు సినిమానే కరెక్ట్ అని తనకు అనిపించిందని, అలా తాను సినిమాల్లోకి వచ్చానని వివరించారు ఉపేంద్ర. అంతేకాదు, తాను చిన్నతనంలోనే దేశ భక్తికి సంబంధించిన పుస్తకాలెన్నో చదివేవాడినని, ఫలితంగా దేశం అంటే ఏంటో తెలియని వయస్సులోనే తాను దేశం అభివృద్ధి గురించి ఆలోచించడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చారాయన.

ఒక నాటకం నన్ను మార్చేసింది...

ఒక నాటకం నన్ను మార్చేసింది...

ముఖ్యంగా తాను 5వ తరగతి చదివేటప్పుడు వేసిన 'కాంపౌండర్ గూండా' అనే నాటకం తనలో ఈ మార్పుకి కారణమైందని, ఆ నాటకంలో తాను పోషించిన పాత్రకి ఆడియెన్స్ నుంచి భారీ ప్రశంసలు లభించాయని నటుడు ఉపేంద్ర చెప్పారు. అప్పుడే తనకు అర్థమైందని, నలుగురికి ఆదర్శంగా నిలిచే పని ఏదో చేయాలని, ఆ తపనకితోడు నటించే శక్తి, సామర్థ్యాలు తనలో సహజంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు ఈ కన్నడ రియల్ స్టార్.

English summary
To Enter into Politics, I Entered into Movies said Kannada Real Star Upendra here in Bangalore while talking to Media. After announcing the establishimet of New Political Party by him, he answered lot of questions raised by media. He also told that his mind was changed in his childhood after acting in a drama while he is studying 5th standard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X