టీటీవీ దినకరన్ సీన్ విజయవాడకు: ఆంధ్రా నాయకుల కోసం వేట, పరుగో పరుగు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే నాయకుడు, మాజీ ఎంపీ టీటీవీ దినకరన్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు వెళ్లింది. అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఒక వెలుగు వెలగాలనుకున్న టీటీవీ దినకరన్ కు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు చుక్కలు చూపించడానికి రెడీ అయ్యారు.

తమిళ తారలను వేధించిన దినకరన్, జనార్దన్, అందుకే నమిత, ఇంధ్ర హీరోయిన్!

ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని టీటీవీ దినకరన్ మీద కేసు నమోదు అయ్యింది. ఇదే కేసులో దినకరన్ ను అరెస్టు చేసిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయన్ను చెన్నైకి తీసుకు వచ్చి విచారణ చేస్తున్నారు.

To know the Hawala money dealings, TTV Dinakaran is taking to Vijayawada.

ఇప్పుడు సరి కొత్త సీన్ తెర మీదకు వచ్చింది. టీటీవీ దినకరన్ చెన్నై, బెంగళూరు, చెన్నై కేంద్రాలుగా ఎన్నికల యంత్రాంగానికి లంచం ఎర వేశారని ఢిల్లీ అధికారులు గుర్తించారు. అయితే ఆయన్ను చెన్నై పోలీసులు చెన్నై తీసుకు వచ్చి విచారణ చేసిన తరువాతే అసలు విషయం వెలుగు చూసింది.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి ఆయన అసలు వ్యవహారం మొదలు పెట్టారని తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు ఆశ్చర్యానికి గురైనారు. వెంటనే టీటీవీ దినకరన్ ను విజయవాడ తీసుకు వెళ్లి విచారణ చెయ్యడానికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు బయలుదేరారు. టీటీవీ దినకరన్ హవాల సోమ్మును ఎన్నికల కమిషన్ కు ఎర వేశారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
To know the Hawala money dealings, TTV Dinakaran is taking to Vijayawada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి