వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Today in Parliament : ఢిల్లీ పోలీసు చట్టానికి సవరణ - అఖిలపక్ష నేతల సమావేశం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ సమావేశాల్లో ఈ రోజున ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. గురువారం సభలో రక్షణ శాఖా మంత్రి రాజ్ నాధ్ సింగ్ సీడీఎస్ బిపిన్ రావత్ సహా 12 మంది ఆర్మీ చాప్ ప్రమాదంలో మరణించిన అంశం పైన ప్రకటన చేసారు. త్రివిధ దళాలతో ఏర్పాటు చేసిన టీం విచారణ చేస్తోందని వెల్లడించారు. ఇక, వారి పార్దివ దేహాలను ఢిల్లీకి తరలించారు. వారికి ప్రధాని మోదీతో సహా పలువురు నివాళి అర్పించారు.

ఇక, ఈ రోజు జరిగే సభలో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. ఆ తరువాత పలు స్టాండింగ్ కమిటీలు రూపొందించిన నివేదికలను సభ ముందు ఉంచనున్నారు. అదే విధంగా రెండు తీర్మానాలను సభ ఆమోదించనుంది. ఇక, ఢిల్లీ పోలీసు చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రతిపాదనలు సభ ముందు ఉంచనున్నారు. ఆ తరువాత ఈ బిల్లును సభ ఆమోదించనుంది. ఇక, రాజ్యసభలో గురువారం ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తమిళనాడు లో ఆర్మీ చాపర్ ప్రమాదం పైన తమకు రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరాగా.. సభాపతి తిరస్కరించారు.

Today in Parliament :Govt bill to ammend Delhi police act in loksabha, oppostion parties meet on members suspension

Recommended Video

Army Helicopter క్రాష్ : Lance Naik Sai Teja From AP, PSO To Gen Rawat || Oneindia Telugu

12 మంది సభ్యుల సస్పెన్షన్ పైన గురువారం సమావేశమవ్వాలని ప్రతిపక్షాలు భావించాయి. అయితే, బిపిన్ రావత్ ప్రమాదంలో మరణించటంతో సమావేశాన్ని వాయిదా వేసారు. సభ్యుల పైన విధించిన సస్పెన్షన్ ను ఉప సంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజున ప్రతిపక్షాలు ఇదే అంశం పైన సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయితే, రాజ్యసభ ఛైర్మన్ మాత్రం సభ్యులు క్షమాపణ చెబితేనే సస్పెన్షన్ ఉపసంహరిస్తామని స్పష్టం చేసారు. దీంతో..దీని పైన అనిశ్చితి కొనసాగుతోంది. ఇక, ఈ రోజు సభ ముందుకు సభ్యులు ప్రయివేటు బిల్లులు సైతం ప్రతిపాదించనునున్నారు.

English summary
Today in Parliament :Govt bill to ammend Delhi police act in loksabha, oppostion parties meet on members suspension
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X