యూపీలో కాంగ్రెస్ స్ట్రాటజీ : బలహీనస్థానాల్లో కూటమి అభ్యర్థులకు సపోర్ట్, ఇంటర్వ్యూలో రాహుల్
న్యూఢిల్లీ : యూపీలో మహాకూటమి మెజార్టీ సీట్లు సాధిస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి, కాంగ్రెస్ పార్టీ కలిసి మెజార్టీ సీట్లు గెలుస్తాయని అంచనా వేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు తగిన వ్యుహంతో ముందుకెళ్తున్నట్టు స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఓ ఇంగ్లీష్ వార్తాసంస్థకు తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు రాహుల్ గాంధీ.

కూటమిదే విజయం
యూపీలో ఎస్పీ, బీఎస్సీ కూటమి లేదంటే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తాయని రాహుల్ లెక్కగట్టారు. తమ అభ్యర్థులు బలహీనమైన విజయం సాధిస్తారని ఇటీవల ప్రియాంక చేసిన వ్యాఖ్యలను రాహుల్ సమర్థించారు. యూపీలో ఎలాగైనా ఎక్కువ సీట్లలో గెలువాలని యూపీ ఇంచార్జీలు ప్రియాంక, జ్యోతిరాదిత్య సింధియాకు స్పష్టంచేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల్లో గెలువలేని పరిస్థితి ఉన్న చోట మహాకూటమి అభ్యర్థులకు సపోర్ట్ చేయాలని సూచించినట్టు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాహుల్.

దూరానికి కారణమెంటో ?
యూపీలో కలిసి పోటీచేస్తున్న ఎస్పీ-బీఎస్పీ కూటమి మహాకూటమితో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే .. ఆ ప్రశ్న వారినే అడగాలని కోరారు రాహుల్. ఇది వారి వ్యుహాత్మక ఎత్తుగడ అయి ఉంటుందని స్పష్టంచేశారు.

గౌరవించి ఒక్కటిగా ...
వాస్తవానికి యూపీలో మాయావతి, ములాయం సింగ్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంది. అయితే వారిద్దరిని గౌరవించి, విలువిచ్చి మహాకూటమి ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. దీంతో కూటమి బలపడి, బీజేపీ బలహీనపడుతోందని రాహుల్ అంచనా వేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications