ఆ మాటే ప్రాణం తీసింది: 'విస్కీ'లో అది మిక్స్ చేసుకోమన్నందుకు..

Subscribe to Oneindia Telugu

ముంబై: స్నేహితులంతా కలిసి వేసిన సరదా సిట్టింగ్ చివరకు విషాదాంతం అయింది. ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 25ఏళ్ల యువకుడు స్నేహితుడి చేతిలోనే హత్యకు గురయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబై యువకులు సందీప్ గవాస్(27), అచ్యుత్ చౌబే(25) మరో ముగ్గురు స్నేహితులు కలిసి బయందర్ ప్రాంతంలో శనివారం రాత్రి మందు పార్టీ చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2గం. వరకు వీరంతా మద్యం సేవించారు.

Told to use urine for his whisky, man kills friend

అప్పటికీ తాగింది సరిపోకపోవడంతో మరో పెగ్ విస్కీ తాగాలనుకున్నాడు గవాస్. కానీ తీసుకొచ్చిన వాటర్ అయిపోవడంతో.. విస్కీలో మిక్స్ చేయడానికి నీళ్లు లేకుండా పోయాయి. ఎలా అని ఆలోచిస్తుండగా.. 'నీ విస్కీ గ్లాసులో నీ యూరిన్ నువ్వే మిక్స్ చేసుకుని తాగు..' అంటూ అచ్యుత్ దూబే అతన్ని టీజ్ చేశాడు.

మిగతా స్నేహితులు కూడా అలాగే ఆటపట్టించడంతో గవాస్ తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. పక్కనే ఉన్న ఓ దుంగను తీసుకుని చౌబే తలపై బలంగా గాయపర్చాడు. మధ్యలో వివేక్ సింగ్ అనే స్నేహితుడు అడ్డుపడగా.. అతనిపై కూడా దాడి చేశాడు.

తీవ్ర రక్తస్రావమైన దూబే ప్రాణాలు విడవడంతో గవాస్ అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం స్థానికులు దూబే మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A drinking session in Bhayander on Sunday turned tragic when a 25-year-old man was killed by his friend for suggesting that he use urine for his whisky after the group ran out of water.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి