Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజమౌళికి కీలక బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం..!!

టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి కర్ణాటకలో కీలక బాధ్యతలు లభించాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

బెంగళూరు: పొరుగునే ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరకుంటోంది. ఈ నెలాఖరులోగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో- ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలకు మరింత పదును పెడుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. ఇప్పటికే జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టాయి. ఆయా పార్టీల సీనియర్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.

ఊపందుకున్న ప్రచారం..

ఊపందుకున్న ప్రచారం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే కర్ణాటకకు వచ్చిన విషయం తెలిసిందే. శివమొగ్గలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోన్నారు. కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలను నిర్వహిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గె సొంతం రాష్ట్రం కావడం వల్ల.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

రాజమౌళికి కీలక బాధ్యతలు..

రాజమౌళికి కీలక బాధ్యతలు..

ఈ పరిణామాల మధ్య టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరు తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల ప్రచారకర్తగా ఆయన నియమితులయ్యారు. రాయచూర్ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు రాజమౌళి. జిల్లాలో పోలింగ్ సమయంలో ఓట్ల శాతాన్ని పెంచడానికి ఆయన సేవలను వినియోగించుకోనుంది కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

ఓటర్లల్లో చైతన్యం..

ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి, ఎన్నికలు-పోలింగ్ ప్రక్రియపై వారికి అవగాహన కల్పించడానికి ఎన్నికల కమిషన్ అంబాసిడర్ గా పని చేయనున్నారు రాజమౌళి. ఆయా అంశాల్లో అడ్వర్టయిజ్‌మెంట్ల చిత్రీకరణలో కనిపిస్తారు. దీనిపై ఇప్పటికే రాయచూర్ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్.. ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొప్పళ, బళ్లారి, బెంగళూరు సిటీ, విజయపుర... వంటి పలు జిల్లాలకు అంబాసిడర్లు నియమితులయ్యారు.

రాజమౌళే ఎందుకు?

రాజమౌళే ఎందుకు?

ఇక్కడ రాజమౌళిని ఎంపిక చేయడానికి కారణాలు లేకపోలేదు. పాన్ వరల్డ్ దర్శకుడిగా ఆయన గుర్తింపు ఉండటం ఒక ఎత్తయితే- రాయచూర్ జిల్లాలో ఆయన జన్మించడం మరో ఎత్తు. 1973 అక్టోబర్ 10వ తేదీన రాయచూర్ జిల్లా మాన్వి తాలూకాలోని అమరేశ్వర క్యాంప్ లో రాజమౌళి జన్మించారు.

వ్యవసాయభూమి..

వ్యవసాయభూమి..

రాయచూర్ జిల్లాతో రాజమౌళి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగానే ఆయనను జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమించిందక్కడి యంత్రాంగం. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కు మాన్విలో స్థలాలు ఉన్నాయి. 1968లో ఆయన అక్కడే నివసించారు. తన పొలంలో వరిసాగు చేసే వారు. రైల్వే ట్రాక్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆయన స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. దీనితో 1977లో ఏపీకి తిరిగివచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+