ఆలస్యంగా వచ్చారని గవర్నర్‌ని విమానం ఎక్కనివ్వలేదు

తిరువనంతపురం: కేరళ గవర్నర్‌కు ఎయిర్ ఇండియా విమాన పైలట్ షాకిచ్చారు. ఆలస్యంగా వచ్చారని గవర్నర్ సదాశివంను విమానంలోకి ఎక్కించుకోలేదు. ఈ సంఘటన మంగళవారం నాడు రాత్రి జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గవర్నర్ సదాశివం ఆలస్యంగా వచ్చాడని విమానం ఎక్కించుకునేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన పైలట్ ససేమిరా అన్నాడు. విమానం ఆలస్యంగా వస్తుందని తనకు సమాచారం ఉందని, అందుకే తాను కాస్త ఆలస్యంగా వచ్చానని పైలట్‌కు గవర్నర్ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ ఆ పైలట్ వినలేదు. దీంతో గవర్నర్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మంగళవారం రాత్రి కొచ్చి నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన సదాశివం పైలట్ తిరస్కరణతో రాత్రి అక్కడే బస చేశారు.

Too late: Air India pilot refuses to let Kerala governor catch flight

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్ కార్యాలయం పైలట్ పైన ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. ఆ పైలట్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. అయితే గవర్నర్ వచ్చేలోగానే విమానం వెళ్లిపోయిందని, ఈ నేపథ్యంలో గవర్నర్‌ను విమానం ఎక్కించుకునేందుకు పైలట్ నిరాకరించడం అనే మాటే ఉత్పన్నం కాదని కొచ్చి విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, ఆ విమానం షెడ్యూలు రాత్రి 10.45కు ఉందని తనకు తెలిసిందని గవర్నర్ చెప్పాడని తెలుస్తోంది. అసలు ఆ విమానం షెడ్యూల్ రాత్రి 9.50 నిమిషాలకు ఉంది. గవర్నర్ రాత్రి పది గంటల నలభై నిమిషాలకు విమానాశ్రయానికి వచ్చారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+