14 మంది దొంగ బాబాలు: అఖారా పరిషత్, ఆశారాం భక్తుడి బెదిరింపు
తమకు తాము దేవుళ్లుగా ప్రకటించుకుంటూ బాబాలుగా చలామణి అవుతున్న వారి వల్ల మొత్తం సాధువులకు, సన్యాసులకు చెడ్డపేరు వస్తోందని అఖిల భారతీయ అఖాఢా పరిషత్ భావిస్తోంది.
అలహాబాద్: తమకు తాము దేవుళ్లుగా ప్రకటించుకుంటూ బాబాలుగా చలామణి అవుతున్న వారి వల్ల మొత్తం సాధువులకు, సన్యాసులకు చెడ్డపేరు వస్తోందని అఖిల భారతీయ అఖాఢా పరిషత్ భావిస్తోంది.
హిందూ సాధువులకు సంబంధించిన కీలక సంస్థ అయిన ఈ అఖిల్ భారతీయ అఖారా పరిషద్ ఆదివారం నకిలీ బాబాల జాబితాను విడుదల చేసింది.

ఇందులో తమను తాము దైవాంశ సంభూతులుగా పేర్కొంటూ బాబాల అవతారం ఎత్తిన 14 మంది నకిలీ ఆధ్యాత్మిక గురువుల పేర్లున్నాయి.
ఆశారాం బాపూ, ఆయన కుమారుడు నారాయణ్ సాయి, డేరాబాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్, రాంపాల్ వంటి గురువుల సంచలనాలు వెలుగు చూసిన నేపథ్యంలో అఖారా పరిషత్ ఈ జాబితాను విడుదల చేసింది.
ఇలాంటి బాబాల గుట్టురట్టు చేసి వారి పనిపట్టేందుకు ఒక చట్టం చేయాలని డిమాండ్ చేసింది. ఇలాంటి దొంగ బాబాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజానీకాన్ని అభ్యర్థించింది.
తాము ఈ జాబితాను కేంద్రంతో పాటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపుతున్నట్లు పరిషత్ అధ్యక్షులు స్వామి నరేంద్ర గిరి తెలిపారు.
ఈ జాబితాలో ఆశారాం బాపూ పేరును కనుక ప్రస్తావిస్తే చంపేస్తామంటూ అతడి భక్తుడినని చెప్పుకొంటున్న ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు చెప్పారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications