శశికళకు పోటీగా ఆ ఇద్దరు!.. పార్టీ పగ్గాలపై ఉత్కంఠ
పార్టీ సీనియర్ నేతలైన సెంగోట్టయ్యన్, తంబిదురైలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి కోసం శశికళకు గట్టి పోటినిస్తున్నట్టుగా తెలుస్తోంది.
చెన్నై: జయలలిత మృతి తర్వాత తమిళ అధికార పార్టీ అన్నాడీఎంకేలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో జయలలిత ఏకఛత్రాధిపత్యమే తప్ప నంబర్ టూ ప్రస్తావన ఎప్పుడూ లేదు. జయ మరణం తర్వాత ఇప్పుడా విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రభుత్వ పగ్గాలు పన్నీర్ సెల్వంకు.. పార్టీ పగ్గాలు?
అంతా భావించినట్టే.. తొలినుంచి జయకు నమ్మిన బంటుగా అత్యంత విశ్వసనీయుడిగా ఉంటూ వస్తున్న పన్నీర్ సెల్వంకే అధికార పగ్గాలు అప్పజెప్పారు. ఒకరిద్దరు మినహా ఈ విషయంలో అంతగా వ్యతిరేకత వ్యక్తమవకపోవడంతో.. ఆయన ఎంపిక సులువుగానే జరిగిపోయింది.
ఇక ఇప్పుడు తేలాల్సింది పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించాలన్నది. శశికళ ఆ పదవిలో కూర్చోవడం లాంఛనమే అని భావిస్తున్నప్పటికీ.. పార్టీలోని ఇద్దరు సీనియర్ల నుంచి కూడా ఆమెకు గట్టి పోటి ఎదురవుతోంది.

శశికళకు పోటిగా ఎవరా ఇద్దరు?
పార్టీ సీనియర్ నేతలైన సెంగోట్టయ్యన్, తంబిదురైలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి కోసం శశికళకు గట్టి పోటినిస్తున్నట్టుగా తెలుస్తోంది. జయ ఉన్నన్ని రోజులు.. ప్రధాన కార్యదర్శి విషయంలో ఇంకొకరి ప్రస్తావనే లేదు కాబట్టి.. అంతా సాఫీగానే సాగిపోయింది.
జయ మరణం తర్వాత.. తొలిసారి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై ఇంత మీమాంస కొనసాగుతున్న పరిస్థితి. కాగా, ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన ఏ పార్టీ అయినా.. ఆరు నెలలకో సారి సర్వసభ్య సమావేశం నిర్వహించి పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాల్సిన విషయం తెలిసిందే.

వీరంతా కీలకమే
ఏఐఏడీఎంకె కార్యవర్గంలో ప్రధాన పార్టీ నిర్వాహకులు 38 మంది, ప్రత్యేక ఆహ్వానితులైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి 270 మంది ఉన్నారు. జనరల్ బాడీలో 3300 మంది సభ్యులున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నియామకానికి వీరంతా మద్దతు పలకాల్సి ఉంటుంది.

కసరత్తులు మొదలయ్యాయ్
పార్టీ ప్రధాన కార్యదర్శి కోసం శశికళ, సెంగోట్టయ్యన్, తంబిదురై ఇప్పటికే తమ తమ ప్రయత్నాల్లో తలమునకలైనట్టుగా తెలుస్తోంది. అయితే పదవి కోసం పోటి పడుతున్నట్టు ఎవరూ బహిరంగంగా ప్రకటించినప్పటికీ అంతర్గత ప్రయత్నాలు మాత్రం మొదలైపోయినట్టుగా సమాచారం. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పీఠం ఈ దఫా ఎవరిని వరించబోతుందన్నది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications