టెలికాం సంస్థలకు ట్రాయ్ షాక్: అందుకు ససేమిరా!, అవసరం లేదన్నారు..
కాల్స్, డేటాకు కనీస ఛార్జీలు వర్తింపజేయాలన్న టెలికాం సంస్థల విన్నపాన్ని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: కాల్స్, డేటాకు కనీస ఛార్జీలు వర్తింపజేయాలన్న టెలికాం సంస్థల విన్నపాన్ని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస ఛార్జీల అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రాయ్ ఛైర్మన్ ఆర్‌ఎస్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు.
టెలికాం సంస్థల అభ్యర్థనపై చర్చించడానికి.. సంస్థ ప్రతినిధులతో శుక్రవారం ఆర్ఎస్ శర్మ భేటీ అయ్యారు. భేటీ అనంతరం.. కనీస ఛార్జీల విధింపు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేయదని తెలిపారు. సుదీర్ఘ ఆలోచన తర్వాతే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పారు. దీనిపై తదుపరి వాదనకు అవకాశం లేదని కూడా స్పష్టం చేయడం గమనార్హం.

కాగా, జియో రాకతో నష్టాల్లో కూరుకుపోయిన పలు టెలికాం కంపెనీలు ఈ ప్రతిపాదనను ట్రాయ్ ముందు పెట్టాయి. అయితే జియో మాత్రం ఈ వాదనను తప్పుపట్టింది. కనీస ఛార్జీల నిబంధన అవసరం లేదని తెలిపింది. అయితే జియో వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకునేందుకే టెలికాం సంస్థలు ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఉచితంగా జియో ఫోన్ ఇస్తామంటూ తాజాగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చేసిన ప్రకటనతో పలు కంపెనీల షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. అదే సమయంలో రిలయన్స్ షేర్లు మాత్రం లాభాలను దక్కించుకోవడం గమనార్హం.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications