వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడలింగ్ కోసం ట్రాక్ పై అలా, ప్రాణాలను పోగోట్టుకొన్నారు

ఫోటోలపై ప్రేమ ఇద్దరి ప్రాణాలను ఫణంగా పెట్టింది. రైలు బ్యాక్ గ్రౌండ్ లో ఫోటోలు తీసుకోవాలనే కోరిక ఇద్దరి ప్రాణాలను తీసింది. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సెల్ఫీలు, ఫోటోలు అంటే అందరికీ ఇష్టమే. స్మార్ట్ పోన్ల యుగం ప్రారంభమైన తర్వాత సెల్ఫీల మోజులో ప్రాణాలను పోగోట్టుకొన్నారు. సెల్పీ అంటే మోజుతో ప్రాణాలు పోగొట్టుకొన్న ఘటనలు ఇటీవల అనేకం చోటుచేసుకొంటున్నాయి.ఇదే తరహ ఘటన ఒకటి న్యూఢిల్లీలో చోటుచేసుకొంది.

రైలు పట్టాల మీద నిలబడి సెల్పీ తీసుకోవాలనే ఉత్సాహం ఇద్దరి ప్రాణాలను తీసింది. యశ్ కుమార్, శుభమ్ అనే విధ్యార్థులు మరో ఐదుగురితో కలిసి ఒకే ట్యూషన్ సెంటర్ లో చదువుకొంటున్నారు. వీరంతా నాలుగు వందల రూపాయాలను జమ చేసుకొన్నారు. ఈ డబ్బుతో ఓ డిఎస్ ఎల్ ఆర్ కెమెరాను అద్దెకు తీసుకొన్నారు.

మోడలింగ్ కోసం ఫోటోలు తీసుకోవాలని భావించారు. రైలు పట్టాల మీద నిలబడి వెనుకనుండి రైలు వస్తుండగా ఫోటోలు తీసుకోవాలని భావించారు.రైలు పట్టాల మీద నిలబడి ఫోటోలు తీసుకోవడంలో వారు మునిగిపోయారు. అయితే అదే సమయంలో రైలు వస్తోన్న విషయాన్ని వారు గుర్తించలేదు.

train crushes two boys clicking photos in delhi

రైలు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకొన్న యశ్, శుభమ్ తాము రెండు రైళ్ళ మద్య నలిగిపోతామన్న భయంతో రెండో ట్రాక్ మీదకు దూకారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ ట్రాక్ మీద అప్పటికే మరో రైలు వస్తోంది. ఈ విషయాన్నివారు గుర్తించలేదు. ఈ ట్రాక్ మీద వస్తోన్న రైలు కింద పడి వీరిద్దరూ చనిపోయారు.

రోహిత్ కుమార్, తుషార్ యాదవ్, భవిత్ తోమర్, రోహిత్ సింగ్ , అమన్ కుమార్ లతో పాటు మరికొందరు స్నేహితులతో కలిసి అక్షర్ థామ్ వద్ద ఫోటోలు తీసుకొన్నా, ఆ ఫోటోలు వారికి నచ్చలేదు.దీంతో రైల్వే ట్రాక్ పై నిలబడి ఫోటోలు తీసుకోవాలని భావించి ప్రాణాలను పోగోట్టుకొన్నారు.

English summary
train crushes two boys clicking photos in delhi ,yash kumar and shubam along with friends went to railay track for clicking photos, they didnot identifiy when train comes near
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X