జనరల్ బోగీలు రైలు మొదట్లో, చివర్లో ఎందుకుంటాయో తెలుసా?

ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మార్పులు చెందుతూ వస్తోంది. రైలు బండి ఎక్కేటప్పుడు ఆ రైలులో అనేక కోచ్ లు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ కూపేలాంటివి ఉంటాయి. ఈ కోచ్ ల టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేసే సమయంలో సాధారణ కోచ్ లు ముందు, చివర ఉంటాయి. ప్రతి రైలులో ఇలాగే ఉంటాయి.

గరిష్ట సంఖ్యలో ప్రయాణికులు: ఇంజన్ దగ్గర, చివర్లో గూడ్స్ బోగీ దగ్గర ఇవి ఉండటానికి ప్రత్యేక కారణం ఉంది. రైలులోని సాధారణ కోచ్‌లలో సాధారణంగా గరిష్ట సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు. ఈ కోచ్ లను రెండు చివర్ల పెట్టినందుకు జనరల్ బోగీ ప్రయాణికులు సరిసమానంగా ముందు, వెనకకు వెళతారు.

train general coach always attached rail starting and ending

ప్లాట్ ఫామ్ కు రెండువైపులా సమానంగా వెళతారు. చేయకపోతే స్టేషన్ మధ్యలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడతారు. స్టేషన్ అంతా రద్దీగా మారిపోతుంది. రెండువైపులా ప్రయాణికుల సంఖ్యను విభజించడంద్వారా ఆర్డర్ ను నిర్వహించడానికి సహాయపడుతుంది.

సహాయక చర్యలకు సౌలభ్యంగా ఉండాలని: ఏసీ కోచ్ లో ప్రయాణించే ప్రయాణికులకు కూడా సౌకర్యం ఉండేలా రైల్వే చూస్తుంది. స్టేషన్ లోకి ప్రవేశించిన వెంటనే వారు బోగీలో ఎక్కేలా రైలుకు మధ్యలో ఉంచుతారు. అత్యవసర పరిస్థితుల్లో జనరల్ కోచ్ లను రెండువైపులా విడదీయడంద్వారా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు సహాయక చర్యలు తీసుకునే విషయంలో ఎంతో సౌలభ్యం లభిస్తుంది. ఒకేచోట ప్రయాణికులు భారీగా గుడికూడటంవల్ల ఇబ్బందులు పెరుగుతాయేకానీ తగ్గవని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+