వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్..?: ముంబై రైల్వేస్టేషన్లలో కూలీల నిరీక్షణ, టికెట్లు దొరక్కపోవడంతో ఇబ్బందులు

|
Google Oneindia TeluguNews

కరోనా ఉగ్ర రూపం దాల్చుతోంది. కేసులు పెరగడంతో దేశ ఆర్థిక రాజధానిలో మళ్లీ ముసలం మొదలైంది. అక్కడి నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు కూలీలు యోచిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అత్యవసర సేవలు తప్ప.. మిగతా వాటిపై ఆంక్షలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ గల వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లాలని అనుకుంటున్నారు. దీంతో లోకమాన్య తిలక్ టెర్మినల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ కూలీలతో నిండిపోయింది.

టికెట్ల కోసం ఇబ్బందులు

టికెట్ల కోసం ఇబ్బందులు

తమ స్వస్థలాలకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసేందుకు వారు వచ్చారు. యూపీ, బీహర్‌కు చెందినవారే ఎక్కువమంది ఉన్నారు. తాను కూడా టికెట్ కొనుగోలు చేశానని రైల్వే ఉద్యోగి ఒకరు తెలిపారు. తాను ముంబైలో నిమ్మరసం విక్రయించి జీవిస్తానని నియాజ్ అహ్మద్ అనే వ్యక్తి తెలిపారు. గత 15 ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తూ ఉంటున్నానని వివరించారు. తనకు భార్య, చిన్నారి ఉన్నారని.. వీధిలో ఉంటూ ఇక్కడ వ్యాపారం చేస్తున్నానని తెలిపారు.

 బండి లేదు.. తిండి లేదు

బండి లేదు.. తిండి లేదు

ఇప్పుడు ఆ బండి లేకపోవడంతో తనకు ఉపాధి లేదని చెప్పారు. దీంతో ఇంటికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. డబ్బులు లేక రెండురోజులకు ఒకసారి అన్నం తింటున్నానని చెప్పారు. టికెట్ లేకుండా వెళ్లాలని అనుకున్నానని.. కానీ చెక్ చేస్తే ఫైన్ వేయాల్సి వస్తుందనే భయంతో ధైర్యం చేయడం లేదని చెప్పారు.

కూలీల వెతలు

కూలీల వెతలు

ఇలాగే సూరజ్ యాదవ్, కృష్ణ కుమార్ నామ్ దేవ్ ఇబ్బంది పడుతున్నారు. వీరిద్దరూ మధ్యప్రదేశ్‌లోని సాత్నాకు చెందినవారు. టికెట్లు లేకపోవడంతో ప్లాట్ ఫామ్ వద్ద పడుకున్నామని చెప్పారు. నెరుల్‌లో గల ఒక హోటల్ వద్ద తాము పనిచేసేవారమని తెలిపారు. అయితే తమకు యజమాని జీతం ఇవ్వనని.. ఆహారం పెడతానని చెప్పారని తెలిపారు. దీంతో ఇక్కడ ఉండి లాభం లేదని వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇంటికెళ్లాక తమకు ఉపాధి లభిస్తుందని నమ్మకం లేదని.. కానీ వ్యవసాయం మాత్రం చేస్తామని చెప్పారు.

English summary
non-essential businesses shut till April 30 as part of the new Covid-19 restrictions in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X