అందుకే పన్ను పెంచలే, మోడీ చెప్పడంతో.. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో అమలు, కానీ 30 శాతం పన్ను: నిర్మలా
కరోనా సమయంలో వ్యక్తిగత పన్ను పెంచలేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్ను పెంచొద్దు అని ప్రధాని మోడీ చెప్పారని వివరించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమెతోపాటు ఆర్థికశాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. వాస్తవానికి దేశంలో ద్రవ్య లోటు ఉందని నిర్మలా సీతారామన్ వివరించారు. ద్రవ్య లోటు ఉన్న పన్ను పెంచలేదని వివరించారు. గతేడాది కూడా పన్ను పెంచలేదని చెప్పారు.

త్వరలో పేరు ప్రకటిస్తాం..
క్రెడిట్ గ్యారంటి పథకానికి రూ.2 లక్షల కోట్లు ఇస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ విడుదల చేస్తోందని వివరించారు. ఆ పేరును త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. అలాగే కోటి కుటుంబాలకు ఉజ్వల పథకం ద్వారా లబ్ది కలుగనుందని చెప్పారు. సహకార సంఘాలపై సర్ చార్జీ తగ్గనుంది.

30 శాతం పన్ను
క్రిప్టో కరెన్సీతో ప్రపంచ వ్యాప్తంగా లావాదేవీలు చేయొచ్చు అని.. కానీ 30 శాతం పన్ను తప్పదని తెలిపారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా సంస్కరణలకు పెద్ద పీట వేశారు.. ఈ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిందని చెప్పారు. నిర్మలా సీతారామన్ వరసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
Recommended Video

రెండేళ్ల సమయం..
కరోనా సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టాక్స్ రిటర్న్స్ అప్డేట్ చేసుకోవడానికి రెండేళ్ల సమయం పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఇదే సమయంలో దేశ అభివృద్ధి పై, దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చే విషయాలపై దృష్టి సారించిన బడ్జెట్లో, వచ్చే మూడేళ్లలో భారత్ 400 కొత్త, ఇంధన-సమర్థవంతమైన వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన బడ్జెట్‌లో ప్రకటించారు. దేశంలో రైల్వే రంగాన్ని కొత్త పుంతలు తొక్కించటంలో భాగంగా నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications