వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజాయితీకి బహుమానం బదిలీ: ఈ కలెక్టర్‌ ట్రాన్స్‌ఫర్‌పై కరోనావారియర్ల ఆన్‌లైన్ క్యాంపెయిన్..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశంలో ఎంతో మంది మంచి ఆఫీసర్లు ఉన్నారు. ఫలానా వారికి కష్టం వచ్చిందంటే వెంటనే రంగంలోకి దిగిపోయి ఆ సమస్యను పరిష్కరించేవారున్నారు. అదే సమయంలో ఉదాసీనతతో వ్యవహరించే అధికారులూ ఉన్నారు. అయితే నిజాయితీతో వ్యవహరించే అధికారులకు ప్రభుత్వాలు ఇచ్చే నజరానా బదిలీ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. తాజాగా ఇలాంటి బహుమానమే ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారికి ఇచ్చింది కర్నాటక సర్కార్. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరు..? ఏంటా కథ..?

మోడీపై దీదీ గుస్సా: ఆపత్కాలంలో కూడా రాజకీయాలేనా..? శివాలెత్తిన ఫైర్ బ్రాండ్మోడీపై దీదీ గుస్సా: ఆపత్కాలంలో కూడా రాజకీయాలేనా..? శివాలెత్తిన ఫైర్ బ్రాండ్

 నిజాయితీకి బహుమానం బదిలీ

నిజాయితీకి బహుమానం బదిలీ

అసలే కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఐఏఎస్ అధికారులు. అయితే కొందరు చాలా సిన్సియర్‌గా పనిచేస్తున్న అధికారులపై బదిలీ వేటు పడుతోంది. ఇలా బదిలీ వేటు పడిన వారిలో ఒకరు మణివణ్ణన్ ఐఏఎస్. అవును కర్నాటక ప్రభుత్వంలో లేబర్ డిపార్ట్‌మెంట్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మణివణ్ణన్ పై యడియూరప్ప సర్కార్ బదిలీ వేటు వేసింది. తన బదిలీకి సంబంధించి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది కర్నాటక సర్కార్. అంతేకాదు ఆయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారి మహేశ్వర్ రావుకు పోస్టింగ్ ఇచ్చింది.

నిరసన తెలిపిన కోవిడ్ వారియర్స్

నిరసన తెలిపిన కోవిడ్ వారియర్స్

కోవిడ్-19 మహమ్మారిపై పోరులో కరోనావారియర్స్ టీమ్‌ను ఏర్పాటు చేసి అందరిచేత శభాష్ అనిపించుకున్న మణివణ్ణన్‌ బదిలీ అందరినీ షాక్‌కు గురిచేసింది. మణివణ్ణన్‌ బదిలీతో షాక్‌కు గురైన వాలంటీర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ తాము చేస్తున్న పనిని నిలిపివేశారు. అంతేకాదు మణివణ్ణన్‌ను తిరిగి నియమించాలని కోరుతూ ఒక ఆన్‌లైన్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ వేళ తమ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వని యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరించారు మణివణ్ణన్. వర్కర్ల తరపున నిలబడి యాజమాన్యాలను ప్రశ్నించారు. 24 గంటల్లోనే 700 ఫిర్యాదులు రావడంతో ఆయన మరింత కఠినంగా వ్యవహరించారు. చర్యలు సైతం తీసుకున్నారు. ప్రభుత్వం అలాంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటుందంటూ ట్వీట్ కూడా చేశాడు. ఇక్కడే ఆయన్ను కొందరు అమాత్యులు టార్గెట్ చేశారు.

 మంత్రులకు ఆగ్రహం తెప్పించిన మణివణ్ణన్ సిన్సియారిటీ

మంత్రులకు ఆగ్రహం తెప్పించిన మణివణ్ణన్ సిన్సియారిటీ

ఆయా సంస్థల యజామాన్యాలు అమాత్యులకు చాలా సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. ఇక మణివణ్ణన్ వ్యవహారంతో ఆ యాజమాన్యాలు మంత్రులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మణివణ్ణన్ తీరు సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు ఆయన్న బదిలీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఉంటారనే వార్త షికారు చేస్తోంది. మంత్రులకు కోపం రావడం, మణివణ్ణన్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావడం ఆయన స్థానంలో మరో ఐఏఎస్ మహేశ్వర్ రావును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అంతేకాదు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉంచారు.

Recommended Video

PM Modi Video Conference With CMs On Lockdown Exit, Modi Pitches For Easing Lockdown Curbs
మణివణ్ణన్ టెలిగ్రామ్‌ గ్రూప్‌లో 27వేల మంది యూజర్లు

మణివణ్ణన్ టెలిగ్రామ్‌ గ్రూప్‌లో 27వేల మంది యూజర్లు

1998వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి మణివణ్ణన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తారు. కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో టెలిగ్రామ్‌లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎవరికైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ గ్రూపులో ఫిర్యాదు చేయాలని వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా చాలామంది యాక్టివ్‌గా కరోనావైరస్‌పై డిబేట్స్ చేపట్టారు. అంతేకాదు సర్క్యులేట్ అవుతున్న తప్పుడు వార్తలపై కూడా సమాచారం ఇచ్చేవారు. ఇది పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ గ్రూపులో 27వేల మంది యూజర్లు ఉన్నారు. గతంలో కూడా కర్నాటక ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను మణివణ్ణన్ నిర్వర్తించారు.

English summary
Senior IAS officer and principal secretary, labour department, P Manivannan was transferred late Monday evening. Manivannan, who was also holding the post of secretary, information department, was relieved without posting. Maheshwar Rao, another IAS officer, was posted in his place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X