15 మంది హై కోర్టు జడ్జీల బదిలీ.. ఏపీ, తెలంగాణకు కూడా
దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు జడ్జిల బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 మందిని బదిలీ చేయాల్సి ఉండగా అందులో ఇద్దరిని మినహాయించి మిగతా 15 మందిని బదిలీ చేసింది. తాజా నిర్ణయంతో ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు బదిలీయ్యారు.. ఏపీ హైకోర్టు జడ్జీలుగా జస్టిస్ రవినాథ్ తిలహరి, ఆషానుద్దీన్ అమానుల్లా నియమితులు కాగా.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భయాన్ నియమితులయ్యారు.

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు పంజాబ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించడానికి ఆగస్టు 25, సెప్టెంబర్ 1న కొలీజియం సభ్యులు సమావేశమై 112 మంది పేర్లను పరిశీలించారు. ఇందులో నుంచి 68 మందిని ఎంపిక చేసి కేంద్రానికి సిఫారసు చేశారు. 68 మందిలో 44 మంది బార్ సభ్యులను ఎంపిక చేసుకోగా మిగతావారు జ్యుడిషియల్ అధికారులు. న్యాయశాఖ ప్రకారం, ఈ నెల 1వ తేదీనాటికి మొత్తం 25 హైకోర్టుల్లో 465 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అలహాబాద్ హైకోర్టులోనే 68 ఖాళీలు ఉన్నాయి. పంజాబ్, హర్యానాలో 40, కలకత్తాలో 36 ఖాళీలు ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టు కోసం 16 మందిని, కేరళ హైకోర్టుకు 8 మందిని, కలకత్తా, రాజస్తాన్ హైకోర్టులకు ఆరుగురి చొప్పున నియమించాలని తాజా ప్రతిపాదనలో కొలీజియం పేర్కొంది. వీరితోపాటు గౌహతి, జార్ఖండ్ హైకోర్టుకు ఐదుగురి చొప్పున, పంజాబ్, హర్యానాలకు నలుగురి చొప్పున, చత్తీస్‌గఢ్ హైకోర్టుకు ఇద్దరిని, మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఒకరిని నియమించాలని తెలిపింది.












Click it and Unblock the Notifications