పోరాడి గెలిచిన ప్రీతిక: తమిళనాట ఎస్సైగా హిజ్రా

చెన్నై: తమిళనాడులో తొలిసారిగా ఓ హిజ్రా సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై)గా నియమితులవుతున్నారు. ఎస్సై ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రితికా యాషినికి అనుకూలంగా గురువారం నాడు మద్రాస్‌ హైకోర్టుఆదేశాలు ఇచ్చింది.

ఈ ఉద్యోగం కోసం ఆమె గత కొన్ని రోజులుగా తమిళనాడు యూనిఫామ్‌ సేవల నియామక మండలి పైన పోరాటం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ సంస్థ ఎస్సై నియామకాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో ప్రితికా చేసుకున్న దరఖాస్తును ఆ సంస్థ తిరస్కరించింది.

దాంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రీతిక పరీక్షలు రాశారు. ఇప్పుడు పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి ప్రితికా అర్హురాలేనని స్పష్టం చేసింది.

Transgender candidate entitled to be recruited as SI: court

వచ్చే ఏడాది నుంచి బోర్డు జారీ చేసే దరఖాస్తుల్లో లింగ నిర్ధరణకు సంబంధించిన వివరాల ప్రాంతంలో హిజ్రాల కోసం ప్రత్యేకంగా చోటు కేటాయించాలని కూడా న్యాయస్థానం సూచించింది. తమిళనాడు యూనిఫార్మ్‌డ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 1087 పోస్టులకు ఫిబ్రవరి 8న రిక్రూట్మెంట్ ప్రారంభించింది.

దీనికి 1.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష, ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్, వివా వాయిస్ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రీతిక ఒక్కరే ట్రాన్స్ జెండర్. దీంతో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేయడంతో... ప్రీతిక కోర్టుకు వెళ్లి గెలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+