Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశంలోనే తొలిసారి: గర్భం దాల్చిన ట్రాన్స్ జెండర్..మార్చిలో బిడ్డకు స్వాగతం!!

దేశంలోనే తొలిసారి వింత సంఘటన జరిగింది. అతడుగా మారిన ఆమె, ఆమెగా మారిన అతడు కలిసి తల్లిదండ్రులు కాబోతున్నారు. గర్భం దాల్చిన ట్రాన్స్ జెండర్ జంట మార్చిలో బిడ్డకు స్వాగతం పలకనున్నారు.

సాధారణంగా ట్రాన్స్ జెండర్లకు పిల్లలు పుట్టే అవకాశం లేదని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఊహించని విధంగా ట్రాన్స్ జెండర్లు కూడా తాము తల్లిదండ్రులమవుతున్నామని ఒక సంచలన ప్రకటన చేశారు. దేశంలోనే తొలిసారి కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

పురుషుడిగా మారిన ఒక మహిళ గర్భవతిగా

ట్రాన్స్ జెండర్లకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. వారు సరోగసి ద్వారానో లేదా ఎవరి వద్దనుండి అయినా పిల్లలను దత్తత తీసుకోవడం ద్వారానో సంతానం కోసం ప్రయత్నం చేస్తారు. అయితే అలా కాకుండా నేరుగా పురుషుడిగా మారిన ఒక మహిళ గర్భవతిగా మారి మరీ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం అతడిగా మారిన ఆమె ఎనిమిదో నెల గర్భంతో ఉంది. మరో నెల రోజుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇది నమ్మశక్యంగా లేకున్నా కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ లో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ జంట ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే తాము మాతృత్వాన్ని, పితృత్వాన్ని చవిచూడబోతున్నట్టు అతడిగా మారిన ఆమె ప్రకటించారు.

మార్చిలో బిడ్డను లోకానికి పరిచయం చెయ్యనున్న ట్రాన్స్ జెండర్

మహిళగా పుట్టి పురుషుడిగా మారిన జహాత్ , పురుషుడిగా పుట్టి మహిళగా.. జియా పావల్ గా మారిన ఇద్దరూ మూడు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే వారు ఇరువురు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు. మార్చిలో తమ బిడ్డను ఈ లోకానికి పరిచయం చేయబోతున్నామని, ఇందుకు సంబంధించి ప్రెగ్నెన్సీ ఫోటోలను నెటిజెన్లతో వారు పంచుకున్నారు.

ఉద్వేగంగా ట్రాన్స్ జెండర్ పోస్ట్

పురుషుడిగా పుట్టి స్త్రీగా మారిన జియా ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టారు. తాను, తన శరీరం పుట్టుకతో స్త్రీ కానప్పటికీ ఒక బిడ్డ తనను అమ్మ అని పిలుస్తుందని, ఒక బిడ్డతో అమ్మా అని పిలిపించుకోవాలనేది తన కల అని పేర్కొన్నారు. తాను తల్లి కావాలని ఏ విధంగా అయితే కలలు కంటున్నానో, జహాత్ కూడా తండ్రి కావాలని కలలు కంటున్నారని చెప్పుకొచ్చారు. దీంతో తమ ఇద్దరి సమ్మతితో తాను ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు వెల్లడించారు.

 ట్రాన్స్ జెండర్ కు గర్భం వెనుక కారణం ఇదే

ట్రాన్స్ జెండర్ కు గర్భం వెనుక కారణం ఇదే

అయితే స్త్రీ నుంచి పురుషుడిగా మారిన ట్రాన్స్ జెండర్ కు గర్భం ఏ విధంగా సాధ్యమవుతుంది అన్నది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న ప్రశ్న. అయితే ట్రాన్స్ జెండర్ గా మారిన సమయంలో చేయించుకున్న శస్త్ర చికిత్సలో అతని గర్భాశయాన్ని, మరికొన్ని అవయవాలను తొలగించకపోవడంతో ప్రస్తుతం అతను గర్భవతయ్యాడు. ఏది ఏమైనా సృష్టికి భిన్నంగా ట్రాన్స్ టెండర్లు గా మారిన వీరు తల్లిదండ్రులు కావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించినా, తల్లిదండ్రులు కావాలనే వీరి తపనను నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు. సంతోషంగా జీవించాలంటూ కొందరు వారిని ఆశీర్వదిస్తున్నారు.

బిడ్డకు జన్మనిస్తే అతడిగా మారిన ఆమె.. అమ్మనా? నాన్ననా? కొత్త చర్చ

నెటిజన్లలో కొత్త చర్చ కూడా జరుగుతుంది. ఆడ నుండి మగగా మారిన ట్రాన్స్ జెండర్ గర్భం దాల్చి బిడ్డను కంటారు కాబట్టి తల్లి అవుతారా? లేకా పురుషుడిగా మారారు కాబట్టి కన్నప్పటికీ తండ్రే అవుతాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+