మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిందా: అయితే ఇది తెలుసుకోండి

ప్రయాణికులకు రైల్వే శుభవార్త వినిపించింది. కన్ఫర్మ్ అయిన రైలు టికెట్‌ తేదీని కూడా మార్చుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకునిరానుంది. ప్రయాణ తేదీలను మార్చుకోవడానికి ఉద్దేశించిన అన్నిరకాల వెసలుబాటును కల్పించబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై రైల్వే మంత్రిత్వ శాఖ వర్కవుట్ చేస్తోంది. ఈ కొత్త సౌకర్యం ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని అందించనుంది.

కన్ఫర్మ్ టికెట్ తేదీని మార్చుకునే సౌకర్యం జనవరిలో ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ మార్పు వల్ల రైలు ప్రయాణం సులభతరమౌతుందని, ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒకసారి ఇది అమల్లోకి వస్తే- తమ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా తేదీలను మార్చుకునే వీలు ప్రయాణికులకు కలుగుతుంది.

Travel Made Easy Indian Railways Introduces Date Change Option for Confirmed Tickets

కన్ఫర్మ్ అయిన టికెట్ ను రద్దు చేసుకోవడానికి చాాలామంది వెనుకాడుతుంటారు. దీన్ని రద్దు చేయడానికి వారికి మనసొప్పదు. ఈ సౌకర్యం వల్ల మళ్లీ బుక్ చేసుకునే ఇబ్బంది తప్పుతుంది. దీని ద్వారా ప్రయాణికులు తమ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ వెసలుబాటు అందుబాటులో లేదు. ప్రయాణ తేదీని మార్చుకోవాలనుకుంటే, టిక్కెట్‌ను రద్దు చేసి, మళ్లీ కొత్తగా బుక్ చేసుకోవాల్సి వస్తుంది.

పైగా కొత్త టికెట్‌కు అదనపు ఛార్జీలతో పాటు పాత టికెట్ క్యాన్సెలేషన్ కు కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 48 నుండి 12 గంటల ముందు కన్ఫర్మ్ టిక్కెట్‌ను రద్దు చేస్తే, టిక్కెట్ ధరలో 25 శాతాన్ని కోల్పోవాల్సి వస్తోంది. రైలు బయలుదేరడానికి 12 నుండి 4 గంటల ముందు రద్దు చేస్తే.. ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ఒకసారి రిజర్వేషన్ చార్ట్ రూపొందిన తర్వాత టికెట్ రద్దు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా రీఫండ్ అవ్వదు.

ప్రతిపాదిత కొత్త వ్యవస్థ వల్ల ప్రయాణికులు రద్దు, రీబుకింగ్ ఛార్జీలను ఆదా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఆన్‌లైన్, కౌంటర్ బుకింగ్‌.. రెండింటికీ వర్తిస్తుందా, అలాగే ఎన్నిసార్లు తేదీ మార్చుకునే వీలుంటుంది వంటి ఆపరేషనల్ వివరాలపై రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా తుది నిర్ణయాన్ని తీసుకోలేదు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తుదిదశలో ఉన్నాయని, జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+