తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తాం: మమతా పార్టీ

కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్ విభజనను కోరుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు సోమవారం స్పష్టం చేసింది. తాము సమైక్య భారతానికి కట్టుబడి ఉన్నామని, తాము పార్లెమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామని తృణమూల్ కాంగ్రెసు అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రేన్ చెప్పారు.

కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం కోల్‌కతాకు చేరుకునే అవకాశం ఉంది. ఆయన తెలంగాణపైనే కాకుండా ఇతర రాజకీయ విషయాలపై కూడా మమతా బెనర్జీతో మాట్లాడే అవకాశం ఉంది.

Trinamool Congress to oppose Telangana Bill in Parliament

ఇంతకు ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోల్‌కతాకు వచ్చి మమతా బెనర్జీని కలిసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకించాలని ఆయన మమతా బెనర్జీని కోరారు. అందుకు ఆమె హామీ కూడా ఇచ్చారు.

మొదటి నుంచి మమతా బెనర్జీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగానే ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్ వివాదం రగులుతున్న నేపథ్యంలో ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+