రాజ్యసభలో ట్రిపుల్ తలాక్‌పై వాగ్యుద్ధం: అది సరైనదేనని జైట్లీకి డిప్యూటీ చైర్మన్ షాక్
Recommended Video

న్యూఢిల్లీ: ముస్లీం మహిళలకు సమానత్వాన్ని కోరుతూ కేంద్రం తీసుకు వచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును బుధవారం లోకసభలో ప్రవేశ పెట్టారు. కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ దీనిని రాజ్యసభ ముందుకు తీసుకు వచ్చారు. రాజ్యసభలు బిల్లు ప్రవేశ పెట్టిన అనంతరం దీనిపై చర్చ సాగింది. అంతకుముందు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ.. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలంటూ తీర్మానం ఇచ్చారు.
ట్రిపుల్ తలాక్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. మహిళల హక్కులకు తాము, సభ కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని ఆయన సూచించారు. ఈ మేరకు సెలెక్ట్ కమిటీ పేర్లను చదివి వినిపించారు.

ప్రతిపక్షం నిబంధనలు పాటించడం లేదని అరుణ్ జైట్లీ అన్నారు. లోకసభలో కాంగ్రెస్ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు రాజ్యసభలో మాత్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. తీర్మానం ప్రవేశ పెట్టాలంటే ఒక రోజు ముందు నోటీసు ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్ తీరును భారత్ మొత్తం చూస్తోందన్నారు. ఆనంద్ శర్మ తీర్మానం నిబంధనల ప్రకారమే ఉందని డిప్యూటీ చైర్మన్ అన్నారు. తద్వారా అధికార పార్టీకి షాకిచ్చారు. బిల్లుపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సభను గురువారానికి వాయిదా వేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications