ట్రక్కు బోల్తా: ఎన్నికల ప్రచారానికి వెళ్లివస్తూ ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి

అగర్తాల: ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా ప్రమాదశాత్తు వాహనం చెట్టును ఢీకొనడంతో ఐదుగురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలోని నూతన్ బజార్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

 Tripura: 5 BJP Workers Died, 6 Others Injured After Mini-Truck accident

ఎన్నికల ప్రచారంలో పాల్గొని మినీ ట్రక్కులో బీజేపీ కార్యకర్తలు తిరుగు పయనమయ్యారు. దక్షిణ త్రిపురలోని నూతన్ బజార్‌కు చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ఓ చోట్టును ఢీకొని బల్టీలు కొట్టి లోయలోపడిపోయింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని, మరో ఆరుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బీజేపీ కార్యకర్తలు మృతి చెందడం పట్ల ఆ పార్టీ అధిష్టానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+