త్రిపురలో 40 సీట్లు వస్తాయంటే మోడీ నమ్మలేదు: రామ్ మాధవ్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: త్రిపుర రాష్ట్రంలో మూడు నెలల్లోనే పరిస్థితిని మార్చివేశామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, త్రిపురలో బిజెపి గెలుపులో కీలక పాత్ర వహించిన రామ్‌ మాధవ్ చెప్పారు. మూడు మాసాల్లోనే సిపిఎం కంటే అన్ని రంగాల్లో తాము ముందుండేలా చేసిన ప్లాన్ తమ పార్టీని విజయపథంలో నడిపించిందని రామ్ మాధవ్ చెప్పారు.

త్రిపుర రాష్ట్రంలో బిజెపి ఏ రకంగా విజయం సాధించిందనే విషయమై రామ్ మాధవ్ ఓ తెలుగు మీడియాతో పంచుకొన్నారు. చివరి ఆరు మాసాల్లో ఎన్నికల ఫలితాల్లో మార్పులు చోటు చేసుకొంటాయని రామ్ మాధవ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు సరైన అభ్యర్ధులు కూడ లేరని రామ్ మాధవ్ చెప్పారు.

Tripura changes into bjp favor in three months: Ram Madhav

త్రిపుర రాష్ట్రంలో మూడు నెలల్లోనే పరిస్థితిని బిజెపికి అనుకూలంగా మార్చివేశామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పారు. అభ్యర్ధులబయోడేటా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

చివరి మూడు నెలల వరకూ బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం ఏర్పడలేదు. నిఘా వర్గాలు సైతం 15 సీట్లకు మించి రావని చెప్పాయి. బీజేపీకి 40 సీట్ల వరకు వస్తాయన్న నా మాటలను ప్రధాని కూడా విశ్వసించలేదని రామ్ మాధవ్ చెప్పారు. ప్రతి దశలోనూ సీపీఎం కంటే ఒకడుగు ముందున్నాం. కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రచారం చేశామని రాంమాధవ్‌ వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP national general secretary Ram Madhav said that the situation in Tripura has changed in favor of the BJP in three months.He spoke to media at Delhi on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి