ఓపినియన్ పోల్: మాణిక్ 'సర్కార్'కు చివరి రోజులే?
అగర్తలా: త్రిపురలో రెండు దశాబ్దాల సిపిఎం పాలనకు ప్రజలు స్వస్తి పలుకబోతున్నారా అంటే ఓ ఓపినియన్ పోల్ అవుననే అంటోంది. త్రిపుర శాసనసభకు ఫిబ్రవరి 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
సిపిఎం ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని న్యూస్ ఎక్స్ - జన్ కీ బాత్ అంచనా వేసింది. బిజెపి -ఐపిఎఫ్‌టి కూటమి విజయం సాధిస్తుందని అభిప్రాయపడింది. ఆ ఓపినీయన్ పోల్ ప్రకారం - బిజెపి - ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ కూటమి 31 నుంచి7 స్థానాలను గెలుచుకుంటుంది.

త్రిపుర శాసనసభలో మొత్తం 60 స్థానాలున్నాయి. పాలక సిపిఎం 23 నుంచి 29 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఓపినియన్ పోల్ తేల్చింది. కాంగ్రెసు, ఇతర పార్టీలకు ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేసింది.
ఇరవై ఏళ్లుగా త్రిపురను పాలిస్తున్న అతి పేద సిఎం అయిన మాణిక్ సర్కార్ మాత్రం ధన్‌పూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తారని అంచనా వసింది. ఆయన 1998 మార్చి 11వ తేదీన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు కూడా అయిన మాణిక్ సర్కార్ ఎనిమిదో సారి వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నికలను ఎదుర్కుంటున్నారు. స్వప్రయోజనాల కోసం బిజెపి, ఐపిఎఫ్‌టి కూటమి కట్టి వామపక్ష కూటమిని ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని మాణిక్ సర్కార్ విమర్శిస్తున్నారు.
త్రిపుర ఎన్నికలు ఈ నెల 18వ తేదీన జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన జరుగుతుంది. 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 20 మంది మహిళలు.












Click it and Unblock the Notifications