త్రిపురలో కాంగ్రెస్ తీరు సందేహస్పదం: ఫిరాయింపులతో బీజేపీలో నూతనోత్తేజం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మెరుగైన ఫలితాలను సాధిస్తుందా? అన్న సంకేతాలు అందుతున్నాయి. ఇదే జరిగితే ఈశాన్య భారత రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు సాధించినట్లే అవుతుంది. సీపీఎంను కాషాయ పార్టీ బీజేపీ ఢీకొట్టగల సామర్థ్యం ఉన్నదా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అధికార లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న సీపీఎం ఆరోసారి మరో విజయం సాధించే అవకాశాలే కనిపిస్తున్నాయి.
మరోసారి సీపీఎం గెలుపొందితే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించనున్నది. అది జరిగితే ఈశాన్య భారత రాష్ట్రాల్లో తదుపరి విస్తరించడానికి మార్గం సుగమం కావడానికి వీలవుతుంది. గత త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 1.87 శాతం ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో చెప్పుకోదగిన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఏళ్లతరబడి సీపీఎంతో పోటీ పడలేకపోతున్న కాంగ్రెస్

ఏళ్లతరబడి సీపీఎంతో పోటీ పడలేకపోతున్న కాంగ్రెస్

గత ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మూడో స్థానాన్ని బీజేపీ.. ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి వదిలేయనున్నదని పరిస్థితులు చెప్తున్నాయి. వెస్ట్ త్రిపురలో కలప వ్యాపారి బీరేంద్ర దేవ్‌వర్మఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ కూటమిని ఢీ కొట్టడంలో వెనుకబడిన పోటీ పడేందుకు ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ప్రయత్నించలేదు. త్రిపురలో చాలాకాలంగా విపక్షం బలహీన పడుతున్నది. కానీ ఈ ఎన్నికలు విభిన్నం. లెఫ్ట్ ఫ్రంట్‌కు బీజేపీ గట్టి పోటీనిస్తున్నది' అని చెప్పారు. ఈసారి పరివర్తన దిశగా భారీస్థాయిలో ప్రచారం జరుగుతున్నదని అంచనా వేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, విపక్షాల మధ్య గట్టి పోటీ ఉంటుందన్నారు. కానీ విపక్షంలో నూతన పార్టీ అవతరిస్తుందన్నారు.

2013తో పోలిస్తే 2014లో సుమారు ఆరు శాతానికి బీజేపీ ఓటింగ్

2013తో పోలిస్తే 2014లో సుమారు ఆరు శాతానికి బీజేపీ ఓటింగ్

బీజేపీ ఎన్నికల ప్రచార నినాదం ‘చలో పల్టాయి' నినాదంతో ముందుకు సాగుతోంది. ఒకప్పుడు త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో చోటు దక్కించుకోవడం అసంభవమని భావించిన బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ స్థానే ప్రధాన విపక్షం స్థాయికి ఎదిగేందుకు ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు 50 స్థానాల్లో పోటీ చేస్తే 49 చోట్ల డిపాజిట్లు గల్లంతు చేసుకున్నది బీజేపీ. కేవలం రెండు శాతం లోపు ఓట్లు మాత్రమే పొందింది. దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ 37 శాతం ఓటింగ్ పొందితే, సీపీఎం 48 శాతం ఓట్లు పొందింది. కానీ 2014 ఎన్నికల్లోనే పరిస్థితి కొంత మారింది. తన ఓటు శాతాన్ని 5.77కి పెంచుకున్న బీజేపీ.. ఈశాన్య భారతంలో విస్తరణకు చర్యలు చేపట్టింది. అదే క్రమంలో క్షేత్రస్థాయిలో సీపీఎంతో పోటీ పడేందుకు కార్యాచరణ చేపట్టింది.

అసోం, బెంగాల్ నుంచి ప్రచారానికి ‘కమలం’ కార్యకర్తలు

అసోం, బెంగాల్ నుంచి ప్రచారానికి ‘కమలం’ కార్యకర్తలు

త్రిపురలో తొలిసారి క్యాడర్ పునాది గల అధికార సీపీఎంను ఢీ కొట్టేందుకు అదేస్థాయిలో క్యాడర్ బలం గల మరో పార్టీ బీజేపీ రావడం ఇదే మొదటి సారి అని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. సీపీఎంతో పోటీ పడే సామర్థ్యం గల సంస్థాగత బలం ఉన్న పార్టీ బీజేపీ అని ఆ నేత ఒకరు తెలిపారు. అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ.. అధికార సీపీఎంతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి వాదుల్ని చేరదీయడంపైనే ద్రుష్టి సారించిందన్నారు. అభివ్రుద్ధి సాధిస్తామని, ఉపాధి కల్పిస్తామని, కేంద్రం నుంచి ఇతోధిక మద్దతు అందజేస్తామని హామీలిస్తోంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులు బీజేపీలో నూతనోత్సాహాన్ని కలిగించాయి. విపక్ష నాయకుడు సుదీప్ రాయ్ బర్మన్ సహా ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తొలుత త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి తర్వాత గతేడాది ఆగస్టులో చేరిపోయారు.

అనుమానాస్పదంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం తీరు

అనుమానాస్పదంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం తీరు

కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి దూరంగా ఉండటం అనుమానాస్పదంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్క విడత కూడా ప్రచారం చేయకపోవడం మరింత సందేహస్పదంగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సీపీఎం నాయకుడొకరు మాట్లాడుతూ తమ రాష్ట్రంలో బీజేపీ బలం పెంచుకోవడం ఆందోళనకరమని, ఇందులో సందేహమే లేదన్నారు. వారు రాష్ట్రాన్ని విభజించి పాలించు అన్నట్లు వ్యవహరిస్తున్నారని సీపీఎం నాయకుడు అన్నారు. కొన్నేళ్లుగా త్రిపురలో క్షేత్రస్థాయిలో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) పని చేస్తున్నా గణనీయ స్థాయిలో రాజకీయ మార్పులు తీసుకు రాలేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నదని ఆ సీపీఎం నేత ఆందోళన వ్యక్తం చేశారు.

మార్చి మూడో తేదీ నాటికి అసెంబ్లీ ఎన్నికల ఫలితంలో మార్పు

మార్చి మూడో తేదీ నాటికి అసెంబ్లీ ఎన్నికల ఫలితంలో మార్పు

ఎన్నికల వేళ బీజేపీ.. ఇండోజియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) అనే గిరిజన ప్రాంతాల్లో పునాది కల పార్టీతో పొత్తు పెట్టుకున్నది. బీజేపీ 11 ఎస్టీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మరో 9 స్థానాల్లో ఐపీఎఫ్టీ బరిలో నిలిచింది. ఐపీఎఫ్టీ కొన్నేళ్లుగా త్రిపురలో పని చేస్తున్నా.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నది. బీజేపీ, ఐపీఎఫ్టీ కూటమిగా పోటీ చేయడం సానుకూల ఫలితాలనిస్తుందని అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకతతోపాటు పలు అంశాలతో బీజేపీ లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అధికార సీపీఎంకు బీజేపీ ప్రధాన విపక్షంగా నిలవడం ఖాయం అని త్రిపుర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గౌతం చక్మా తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు మనం అంతా వేచి ఉండాల్సిందే. ఐపీఎఫ్టీతో పొత్తు వల్ల తప్పనిసరిగా బీజేపీకి లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 18న పోలింగ్ జరుగనున్నది. వచ్చేనెల మూడో తేదీన ఫలితాలు వెలువడతాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Agartala: If the trends discernable in the run-up to the Tripura elections are any indication, the Bharatiya Janata Party (BJP) is poised to turn in its best performance ever in the northeastern state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి