ఇంగ్లాండ్ లో తళుక్కుమన్న విజయ్, త్రిష.. ఏం జరుగుతోంది..!
తమిళనాడు సీఎం, టీవీకే అధ్యక్షుడు విజయ్- సినీ నటి త్రిషల మధ్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా సీఎం విజయ్ ఇంగ్లాండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మెరిశారు. అయితే అక్కడ త్రిష కూడా ఉండటం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం అయ్యాక మొదటిసారి రాష్ట్ర పెట్టుబడుల కోసం విజయ్ యూకే వెళ్లారు.
అయితే అక్కడే హీరో అజిత్ కుమార్ సైతం తన రేసింగ్ టీమ్ తో కలిసి యూకేలో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం విజయ్ సర్ ప్రైజ్ ఇస్తూ హీరో అజిత్ కుమార్ ను కలిశారు. కోలీవుడ్ కు చెందిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి హాగ్ చేసుకున్నారు. అనంతరం సీఎం విజయ్ యునైటెడ్ కింగ్ డమ్ లోని ప్రసిద్ధ సిల్వర్ స్టోన్ సర్క్యూట్ లో జరగనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మోటార్ రేస్ ను ప్రారంభించారు. ఈ పోటీలో అజిత్ కుమార్ స్వయంగా పాల్గొని పోటీ పడుతుండటంతో అంచనాలు పెరిగాయి.
మరోవైపు నటి త్రిష కూడా ప్రస్తుతం లండన్ లోనే ఉంది. సీనియటి రాధిక.. త్రిషతో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఇక ఇప్పటికే విజయ్- త్రిష మధ్య రూమర్స్ తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఇన్సిడెంట్ మరోసారి చర్చకు దారి తీసింది. కాగా త్రిష ఓ మూవీ షూటింగ్ కోసం ముందుగానే లండన్ వెళ్లినట్లు సీనియర్ నటి రాధిక పోస్ట్ ద్వారా తెలుస్తోంది. మరోవైపు అజిత్ కు సపోర్ట్ చేసేందుకే ఆమె వెళ్లినట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక త్రిష గతంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో హాజరైన సంగతి తెలిసిందే. విజయ్ ఫ్యామిలీ ఎవరూ రాకపోయినా త్రిష మాత్రం ఆ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాక చెన్నైలో ఇటీవల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నటి త్రిష హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఘటనతో విజయ్- త్రిష మధ్య వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications
