CJI DY Chandrachud: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌పైనా మీమ్స్... ట్రోల్స్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. ట్రోలింగ్ ను ఎదుర్కొంటోన్నారు. ఆయనను కించపరుస్తూ పెద్ద ఎత్తున మీమ్స్ పోస్ట్ అవుతున్నాయి. ట్రోలర్లపై చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్
న్యూఢిల్లీ: సాధారణంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై సెలెబ్రిటీల మీద పెద్ద ఎత్తున మీమ్స్ తయారవుతుంటాయి. ట్రోల్స్ పడుతుంటాయి. సినిమా నటులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు.. ఇలా ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, సెలెబ్రిటీలు ట్రోల్స్ కు గురవుతుంటారు. ప్రధానమంత్రి స్థాయి నుంచి ఓ శాసన సభ్యుడి వరకూ ఆయా స్థాయిలను బట్టి ఆన్ లైన్ ట్రోలింగ్స్, మీమ్స్ తీవ్రత కనిపిస్తుంటుంది.
జ్యుడీషియరీ మీద ట్రోల్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ కావడం చాలా అరుదు. న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, న్యాయమూర్తులను కించపరిచేలా వారిపై మీమ్స్ గానీ, ట్రోల్స్ గానీ పోస్ట్ చేస్తే- జైలుపాలు కావడం ఖాయమనే అభిప్రాయం నెటిజన్లు, ట్రోలర్లల్లో బలంగా నాటుకుపోవడమే దీనికి కారణం. న్యాయవ్యవస్థ మీద ట్రోల్స్ చేసి, శిక్షను అనుభవించడం కంటే దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని భావిస్తుంటారు.

ఇప్పుడా అభిప్రాయం మారినట్టే కనిపిస్తోంది ఒక వర్గానికి చెందిన నెటిజన్లల్లో. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే టార్గెట్ గా చేసుకున్నారు కొందరు నెటిజన్లు. ఆయనను ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై భారీగా పోస్టులు పెడుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల మీద సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని అయిదుమంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే విచారణను పూర్తి చేసిన విషయం తెలిసిందే. తీర్పును రిజర్వ్ చేసిందా ధర్మాసనం.
ఈ విచారణ ముగియగానే సీజేఐ డీవై చంద్రచూడ్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపట్ల 13 ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తోన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సైతం ఒక వర్గానికి చెందిన నెటిజన్లు లక్ష్యంగా చేసుకోవడం పట్ల- జ్యుడీషియరీ వ్యవస్థ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టినట్టవుతుందని భావిస్తోన్నాయి. తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ ఈ మేరకు ఆయా పార్టీల నాయకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశాయి.
కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా ఈ లేఖ రాశారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు దిగ్విజయ సింగ్, శక్తిసిన్హ్ గోహిల్, ప్రమోద్ తివారీ, అమీ యజ్ఞిక్, రంజిత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ ఛద్దా, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది ఈ లేఖపై సంతకం చేశారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన జయ బచ్చన్, రామ్ గోపాల్ యాదవ్ కూడా ఇదే అంశంపై అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి ప్రత్యేకంగా లేఖ రాశారు.












Click it and Unblock the Notifications