ఇస్తారా వేరే దారులు చూసుకోమంటారా: సీఎం పోస్టుపై బీజేపీకి శివసేన అల్టిమేటం

మహారాష్ట్ర రాజకీయముఖచిత్రం రసకందాయంలో పడింది. ఏ ఒక్క పార్టీకి ఒంటరిగా స్పష్టమైన మెజార్టీ రాకపోవడం, బీజేపీ-శివసేన కూటమిలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ ఉన్నప్పటికీ... శివసేన మాత్రం తమ డిమాండ్లపై తగ్గడం లేదు. ప్రభుత్వంలో రెండు పార్టీలకు సమానత్వం ఉండాలన్న డిమాండ్‌ను ముందునుంచే వినిపిస్తుండగా... తాజాగా సీఎం పదవి తమకే రెండున్నరేళ్ల పాటు కట్టబెట్టాలనే డిమాండ్‌ను ముందుంచింది. శనివారం రోజున ఇదే విషయమై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పింది. అయితే శివసేన తీసుకొస్తున్న ఒత్తిడితో ఆ పార్టీకి డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు విడివిడిగా తమ పార్టీనేతలతో చర్చలు జరుపుతున్నాయి.

ఇతర దారులు చూసుకుంటాం: శివసేన

ఇతర దారులు చూసుకుంటాం: శివసేన

గత గురువారం రోజున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఆ ఫలితాలను చూసి శివసేన అధినేత ఉద్ధవ్ థ్రాక్రే పదవుల పంపకాల్లో 50:50 ఫార్ములాను అవలంబించాలని గుర్తుచేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుండగా అందులో రెండున్నరేళ్లు సీఎం పదవిని శివసేన పార్టీకి ఇవ్వాలంటూ థాక్రే డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఇందుకు ఒప్పుకోకపోతే ఇతర మార్గాలను ఎంచుకుంటామని శివసేన అల్టిమేటం జారీ చేసింది. అయితే శివసేన అధినేత మాటలను కొట్టి పారేశారు మరో సీనియర్ బీజేపీ నేత. శివసేన బీజేపీలు కలిసి సమానంగా సీట్లు గెలిచి ఉంటే అప్పుడు ఆ పార్టీ డిమాండ్‌పై ఆలోచించే వాళ్లమని చెప్పుకొచ్చారు. శివసేనకు వచ్చిన సీట్లకంటే బీజేపీకి రెండింతలు వచ్చాయనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాంటప్పుడు సీఎం పదవి శివసేనకు ఎలా ఇస్తామని అన్నారు.

 1995లో ఏం జరిగింది..?

1995లో ఏం జరిగింది..?

ఇదిలా ఉంటే 1995 నాటి పరిస్థితులను గుర్తుచేశారు మరో సీనియర్ బీజేపీ నాయకులు. 1995లో బీజేపీ శివసేనలు పొత్తుతో వెళ్లాయని అయితే ఆ సమయంలో శివసేనకు 73 సీట్లు రాగా బీజేపీకి 65 సీట్లు వచ్చినట్లు గుర్తుచేశారు. సీట్ల మధ్య పెద్దగా తేడా లేనప్పటికీ శివసేన పార్టీ నుంచి మనోహర్ జోషి సీఎం కుర్చీని అధిష్టించగా... గోపీనాథ్ ముండే డిప్యూటీ సీఎం పోస్టు తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే బీజేపీకి 105 స్థానాలు వచ్చాయని శివసేనకు 56 స్థానాలే వచ్చాయనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

కీలక పోర్ట్‌ఫోలియోల కోసమే సీఎం పోస్టు డిమాండ్ చేస్తోందా..?

కీలక పోర్ట్‌ఫోలియోల కోసమే సీఎం పోస్టు డిమాండ్ చేస్తోందా..?

ముఖ్యమంత్రి పోస్టును శివసేన డిమాండ్ చేస్తున్న దాని వెనక ఒక వ్యూహం ఉందని అన్నారు శివసేన పార్టీకి చెందిన మాజీ మంత్రి. సీఎం పోస్టు డిమాండ్ చేయడం ద్వారా తామనుకుంటున్న ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలను కేబినెట్‌లో బీజేపీ ఇస్తుందనే ఆశతో శివసేన ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఉద్దవ్ థాక్రే సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటేనే సీఎం పోస్టుపై గట్టిగా డిమాండ్ వినిపించేదని ఆయన చెప్పారు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న డిమాండ్ చాలా వ్యూహాత్మకమైనదని ఆ మాజీ మంత్రి చెప్పారు. ఇక ఆదిత్య థాక్రే రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారని చెప్పిన ఆయన ఆ యువకుడికి పెద్దగా అనుభవం లేదని చెప్పారు.

రిమోట్ కంట్రోల్ మా చేతిలో ఉంది: సంజయ్ రౌత్

రిమోట్ కంట్రోల్ మా చేతిలో ఉంది: సంజయ్ రౌత్

మహారాష్ట్రలో కేబినెట్‌లో 42 మందికి మాత్రమే చోటు ఉంటుంది. హోమ్ శాఖను పక్కనపెడితే రెవిన్యూ, ఆర్థిక, పట్టణాభివృద్ధి, వ్యవసాయశాఖ, ఇరిగేషన్, ఆరోగ్యశాఖ లాంటివి కీలకం కానున్నాయి. అయితే హోమ్‌శాఖ, రెవిన్యూ, పట్టణాభివృద్ధి శాఖలు మాత్రం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోను వదులుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో శివసేన మాతృపత్రిక సామ్నాలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో రిమోట్ కంట్రోల్ శివసేన చేతిలో ఉందంటూ కామెంట్ చేశారు. శివసేన 2014లో పోలిస్తే తక్కువ సీట్లనే గెల్చుకున్నప్పటికీ రిమోట్ కంట్రోల్ మాత్రం తమ చేతిలోనే ఉన్నట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+