మరో ఘోరం: మహిళను ఢీకొట్టి, 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

లక్నో: ఢిల్లీ తర్వాత అలాంటి దిగ్భ్రాంతికర ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. స్కూటర్‌పై వెళుతున్న ఓ మహిళా ఉద్యోగిని ఢీకొన్ని ట్రక్కు.. ఆమెను మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె తీవ్రగాయాలపాలై ప్రాణాలు విడిచింది.

బండాలోని మావాయి బుజుర్గ్ గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో మహిళ స్కూటర్‌పై ఉంది. స్కూటర్‌ను లారీ ఢీకొట్టడంతో ఆ మహిళ కిందపడి లారీకింద చిక్కుకుంది. అయితే ట్రక్కు ఆగలేదు. 3 కిమీ వరకు ఈడ్చుకెళ్లింది. మహిళ ఇరుక్కుపోవడంతో మంటలు వచ్చాయి. దీంతో ట్రక్కు ఆగిపోయింది. మృతురాలు ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

 Truck rams into woman on scooty, drags her for 3 km in Banda, Uttar Pradesh

ప్రాథమిక నివేదికల ప్రకారం.. మహిళ మృతదేహం సెక్కీస్‌లో చిక్కుకోవడంతో ట్రక్కు మంటలు చెలరేగాయి.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని ట్రక్కులో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+