Viral Video: బ్రేక్‌ బదులు యాక్సిలరేటర్ తొక్కాడు.. క్షణాల్లో దూసుకెళ్లిన ట్రక్కు..

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం, అతివేగం. ఈ రెండు కారణాలతో ఎంతో ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం మాత్రం ఆగడం లేదు. తాజాగా మద్యం మత్తులో ట్రక్ నడపడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

వృద్ధుడు మృతి..
గత ఆదివారం రాత్రి కర్ణాటకలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఓ వృద్ధుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ట్రక్కు డ్రైవర్ శ్రీనివాస్ తాగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కొప్పల్ జిల్లా హులిగి గ్రామంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి పరారయ్యాడని, ఆ తర్వాత అరెస్టు చేశామని, బళ్లారి నుంచి వచ్చిన బాధితులు రోడ్డుపై నిద్రిస్తున్నారని ఘటన జరిగినప్పుడు పోలీసులు తెలిపారు.

Truck ran over pilgrims at hoogli in Karnataka on sunday night

బళ్లారికి చెందిన భక్తులు
డ్రైవర్ బ్రేక్ తొక్కబోయి యాక్సిలరేటర్ తొక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న బాధితులు బళ్లారి జిల్లా నుంచి వచ్చిన భక్తులుగా గుర్తించారు. డ్రైవర్‌పై ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేశారు. మృతుడు తిప్పన్న (75)గా గుర్తించగా, హనుమవ్వ, మల్లవ్వ, తుకారాం గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+