ట్రంప్ మోడీ ట్రేడ్ డీల్..దేశవ్యాప్త నిరసనలు, మోదీ సర్కార్ కు రైతుసంఘాల అల్టిమేటం
భారత్, అమెరికా ట్రేడ్ డీల్ రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తుందని రైతుల నుండి విముఖత వ్యక్తం అవుతుంది. భారతదేశం, అమెరికా మధ్య కుదరనున్న వాణిజ్య ఒప్పందంపై పలు రైతు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ ఒప్పందం ద్వారా భారత వ్యవసాయ రంగం తన మనుగడను కోల్పోతుంది అని, ఇండియాలోని వ్యవసాయ రంగం అమెరికా కార్పొరేట్ కంపెనీల వశమవుతుందని వారు ఆరోపించారు.
దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు
దీనికి నిరసనగా, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్), అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్)తో పాటు అనేక రైతు సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి.ఈ వాణిజ్య డీల్ భారతీయ వ్యవసాయ రంగాన్ని అమెరికా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమేనని రైతు సంఘాల నాయకులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా రైతుల భారీ నిరసనలు
ఒప్పందంపై ఆయన చేసిన ప్రకటనలు వాస్తవ దూరంగా ఉన్నాయని పేర్కొంది. ఈ డీల్‌పై సంతకాలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీని కోరిన ఎస్‌కేఎమ్, అలా జరగనిపక్షంలో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు ఉంటాయని హెచ్చరించింది. భారత సర్కార్ ఈ డీల్ విషయంలో రైతాంగానికి నష్టం చేసే చర్యల విషయంలో పునరాలోచించాలని వారు డిమాండ్ చేశారు.
డీల్ తో భారత్ డెయిరీ రంగంపై తీవ్ర ప్రభావం
అమెరికా నుండి వచ్చే మొక్కజొన్న, సోయాబీన్ నూనె వంటి పశుగ్రాస ఉత్పత్తుల దిగుమతి కారణంగా భారత మార్కెట్‌పై, ముఖ్యంగా డెయిరీ రంగంపై దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని అఖిల భారత కిసాన్ సభ పేర్కొంది. ఈ ఒప్పందంతో అమెరికా, ఐరోపా సమాఖ్య ఆర్థిక వ్యవస్థలకే అధిక ప్రయోజనమని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారతదేశానికి పెద్దగా ఉపయోగం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ట్రంప్, మోదీ దిష్టిబొమ్మల దహనం
తమ నిరసనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని క్రాంతికారీ కిసాన్ యూనియన్ నేతలు ప్రకటించారు. ఈ ఒప్పందం తక్కువ ఆదాయం ఉన్న, అప్పులతో కుంగిపోతున్న రైతుల పరిస్థితిని మరింత దిగజార్చుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్, ఈ డీల్ ప్రభావం గురించి గ్రామస్థులు తమను ప్రశ్నిస్తున్నారని, నిరసనల్లో పాల్గొనాలని రైతులకు పిలుపునిచ్చారు.
-
ఇరాన్ తో యుద్దం వేళ ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న అమెరికా ప్రజలు- ఉక్కిరి బిక్కిరి..!! -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా!












Click it and Unblock the Notifications