సీఎం 'యోగి'పై ట్రంప్ ట్వీట్!: చీప్ పబ్లిసిటీతో ఆకాశానికెత్తేస్తున్నారు..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సీఎంగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్ ను ఆయన మద్దతుదారులు ఎంతగా ప్రశంసిస్తున్నారో.. బయటి నుంచి కూడా అంతే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక మతతత్వ వాదిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడంపై చాలామంది గగ్గోలు పెడుతున్నారు.

ఈ విమర్శల పరంపర ఇలా కొనసాగుతుండగానే ఆదిత్యనాథ్ అనుయాయిలు, ఆయన మద్దతుదారులు మాత్రం జనాల్లో ఆదిత్యానాథ్ పాపులారిటీని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వారు చీప్ ట్రిక్స్ సైతం ఉపయోగిస్తుండటం గమనార్హం. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదిత్యానాథ్ యోగిని ఆకాశనికెత్తేసినట్లు సోషల్ మీడియాలో పనిగట్టుకుని ప్రచారం మొదలుపెట్టారు.

Trump's Fake Tweet Congratulating UP CM Yogi Adityanath 2017

యూఎస్‌ను తాను ఎలాగైతే పాలిస్తున్నానో.. ఆదిత్యానాథ్ కూడా యూపీని అలా పాలిస్తాడంటూ ట్రంప్ ట్వీట్ చేసినట్లు ఓ ఫేక్ ట్వీట్ సృష్టించారు. అంతేకాదు, యోగి గొప్ప నాయకుడని, యోగి తనకు సోదరుడి లాంటి వాడని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఫేక్ ట్వీట్స్ సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. ఇదంతా నిజమేనని నమ్మినవారు ట్వీట్స్ ను షేర్ చేస్తుండగా.. అసలు విషయం తెలిసిన నెటిజెన్స్ మాత్రం ఈ చీప్ పబ్లిసిటీని ఎండగడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On Sunday, Hindutva hardliner Yogi Adityanath of the Bharatiya Janata Party took oath as the 21st chief minister of Uttar Pradesh (UP). Soon after the announcement, #YogiAdityanath ruled the roost on social media.
Please Wait while comments are loading...