వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్ దిగ్గజాలకు షాక్: వీసా నిబంధనలతో ఆవిరౌతున్న ఆదాయం

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియాకు చెందిన టాప్ టెక్ బిలీయనీర్లుగా వెలుగొందుతున్న వారి సంపదకు దెబ్బపడుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియాకు చెందిన టాప్ టెక్ బిలీయనీర్లుగా వెలుగొందుతున్న వారి సంపదకు దెబ్బపడుతోంది.

భారత్ కు టెక్నాలజీ ఇండస్ట్రీ ఎంతో ముఖ్యమైంది. గత మూడు దశాబ్దాలుగా దేశీయ ఆర్థికవృద్దిలో ఐటీ సెక్టార్ ఎనలేని సేవలందిస్తోంది.

లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా బిలీనియర్స్ జాబితాలో కనీసం ఏడుగురు భారతీయ వ్యవస్థాపకులు ఉండేలా సంచలనాలు సృష్టిస్తోంది.

Trump's visa missile erodes net worth of all billionaires in India

కానీ, అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక అప్పటి నుండి టెక్ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి.

అమెరికాలో టెక్ సర్వీసులు అందించే కంపెనీలకు షాకిచ్చేలా ట్రంప్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. ఈ నిబంధనలు టాప్ టెక్ బిలీయనీర్లుగా వెలుగొందుతున్న వారి సంపదకు దెబ్బకొడుతోంది.

విప్రో లిమిటెడ్ ఛైర్మెన్ అజీమ్ ప్రేమ్ జీ, హెచ్ సీ ఎల్ ఛైర్మెన్ శివ్ నాడార్, ఇన్పోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి , నందన్ నిలేకని లాంటి ఇతర టాప్ వంద టెక్ రిచెస్ట్ బిలీయనర్ల సంపద అవిరైపోతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

దేశీయ స్టాక్ సూచీలు 0.8 శాతం పైకి ఎగిసిన సమయంలో ఐటీ స్టాక్స్ 3 శాతం మేర పడిపోయాయి. కానీ, వీసా విషయంలో అమెరికా తీసుకొన్న నిబంధనలపై స్పందించడానికి మాత్రం లీడింగ్ అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్ , విప్రో హెచ్ సి ఎల్, టెక్నాలజీలు వెనుకాడుతున్నాయి. ఈ కంపెనీలు అందించే ఎగుమతుల్లో మూడో వంతు రెవిన్యూలు అమెరికా నుండి వస్తున్నాయి.

English summary
It's hard to overstate the importance of the techonology industry to India. Over the past three decades, the IT sector has helped drive the country's economic growth.employed millions and made billionaires out of at least seven foundares
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X