చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TTD: అక్టోబర్ లో శ్రీవెంకటేశ్వర స్వామి భక్తి కన్నడ టీవీ ఛానల్, బెంగళూరులో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కడప/ తిరుపతి: తిరమల తిరుపతి దేవస్థానం ఈవో కెఎస్. జవహర్ రెడ్డి బెంగళూరులోని శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం బెంగళూరు న‌గ‌రంలోని మల్లేశ్వరంలోని వయ్యాలికావల్ ప్రాంతంలో గ‌ల శ్రీ‌వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఈఓ డాక్టర్ కెఎస్. జవహర్ రెడ్డికి టీటీడీ అధికారులు, అర్చ‌కులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

అక్టోబర్ నెల‌లో ఎస్వీబీసీ కన్నడ ఛానెల్ ప్ర‌సారాల‌ను ప్రారంభిస్తామ‌న్నారు. ఛానల్ ప్రారంభం సందర్భంగా పురందరదాస కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి అన్నారు.

TTD: కల్యాణ మండపాలు ఎందుకు లీజుకు ఇస్తున్నారో పక్కా క్లారిటీ ఇచ్చిన టీటీడీ, తప్పుడు ప్రచారం చేస్తే !TTD: కల్యాణ మండపాలు ఎందుకు లీజుకు ఇస్తున్నారో పక్కా క్లారిటీ ఇచ్చిన టీటీడీ, తప్పుడు ప్రచారం చేస్తే !

 బెంగళూరులో టీటీడీ ఈవో

బెంగళూరులో టీటీడీ ఈవో

టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం బెంగళూరు న‌గ‌రంలోని మల్లేశ్వరంలోని వయ్యాలికావల్ ప్రాంతంలో గ‌ల శ్రీ‌వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఈఓ డాక్టర్ కెఎస్. జవహర్ రెడ్డికి టీటీడీ అధికారులు, అర్చ‌కులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

వయ్యాలికావెల్ టీటీడీ ఆద్వర్యంలో శ్రీవెంకటేశ్వరి ఆలయం నిర్వహిస్తున్నారు.

శ్రీవెంకటేశ్వర కన్నడ భక్తి ఛానల్

శ్రీవెంకటేశ్వర కన్నడ భక్తి ఛానల్

వయ్యాలికావెల్ లోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం టీటీడీ ఈవో అక్క‌డి టీటీడీ కల్యాణ‌మండ‌పాన్ని, శ్రీ వేంక‌టేశ్వ‌ర భక్తి ఛాన‌ల్ కన్నడ కార్యాలయాన్ని ప‌రిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ కెస్. జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న అక్టోబర్ నెల‌లో ఎస్వీబీసీ కన్నడ ఛానెల్ ప్ర‌సారాల‌ను ప్రారంభిస్తామ‌న్నారు.

 స్వామి భక్తుల కోరిక మేరకు కన్నడ టీవీ ఛానల్

స్వామి భక్తుల కోరిక మేరకు కన్నడ టీవీ ఛానల్

శ్రీవెంకటేశ్వర కన్నడ భక్తి ఛానల్ ప్రారంభం సందర్భంగా పురందరదాస కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి ఎస్వీబీసీ సీఈఓ శ్రీ సురేష్ కుమార్‌కు సూచించారు. ఈ సందర్బంగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి వెంట టీటీడీ అధికారులతో పాటు వయ్యాలికావల్ లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం నిర్వహణ కమిటీ పదాదికారులు పట్టుబాల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 వైఎస్ఆర్ కడప జిల్లాలో శ్రీవారి పవిత్రోత్సవాలు

వైఎస్ఆర్ కడప జిల్లాలో శ్రీవారి పవిత్రోత్సవాలు

వైఎస్ఆర్‌ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యం, తాళ్ళ‌పాక శ్రీ చెన్న‌కేశ‌వ‌స్వామివారి ఆల‌యం, జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో సెప్టెంబరు మాసంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆయా ఆల‌యాల్లో ఏకాంతంగా నిర్వ‌హించాలని టీటీడీ నిర్ణయించింది.

 ప్రసిద్ది చెందిన ఒంటిమిట్ట ఆలయంలో

ప్రసిద్ది చెందిన ఒంటిమిట్ట ఆలయంలో

కడప జిల్లాలోని ప్రసిద్ది చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 6వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 7వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబరు 8న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 9న మహాపూర్ణాహుతి జరుగనున్నాయి. చివరిరోజు సాయంత్రం 6 గంటలకు ఆల‌య ప్రాంగ‌ణంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించ‌నున్నారని టీటీడీ తెలిపింది.

తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో

తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో

తాళ్ళ‌పాక‌ శ్రీ చెన్న‌కేశ‌వ‌స్వామివారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 10వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 11వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబరు 12న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 13న మహాపూర్ణాహుతి జరుగనున్నాయి. చివరిరోజు సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆల‌య ప్రాంగ‌ణంలో ఊరేగించ‌నున్నారని టీటీడీ తెలిపింది.

జమ్మలమడుగు శ్రీ వెంకటేశ్వరిస్వామి ఆలయంలో

జమ్మలమడుగు శ్రీ వెంకటేశ్వరిస్వామి ఆలయంలో

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 15వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబరు 16వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న మహాపూర్ణాహుతి జరుగనున్నాయి. చివరిరోజు సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆల‌యంలో ఊరేగించ‌నున్నారని టీటీడీ తెలిపింది.

Recommended Video

'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu
 దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో

దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 17వ తేదీ సాయంత్రం విష్వక్సేనపూజ, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబరు 18వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబరు 19న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 20న మహాపూర్ణాహుతి, పవిత్రవితరణ, ఆల‌యంలో ఊరేగింపు జరుగనున్నాయని టీటీడీ తెలిపింది. కోవిడ్ -19 నియమాలు పాటిస్తూ ఈ కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

English summary
TTD: Tirumala Tirupati Devasthanam EO KS Jawahar Reddy visited Sri Venkateswara Swamy Temple in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X