వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్కార్ సినిమా రచ్చ: జయలలిత పేరు కోమలవల్లి కాదు, 2003లో, టీటీవీ దినకరన్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను కించపరిచే విధంగా తమిళ ఇళయ దళపతి విజయ్ నటించిన సర్కార్ చిత్రం తెరకెక్కించారని తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీ నేతలు, మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే జయలలిత అసలు పేరు కోమలవల్లి కాదని, 2003లో అలా ప్రచారం జరిగిందని ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అంటున్నారు.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో హీరో విజయ్ నటించిన సర్కార్ సినిమా దీపావళి పండుగ సందర్బంగా మంగళవారం విడుదలైయ్యింది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కోమలవల్లి పాత్రలో లేడీ విలన్ గా నటించారు.

 TTV Dhinakaran says Komalavalli is not Jayalalithas original name

సర్కార్ చిత్రాన్ని కళానిధిమారన్ కు చెందిన సన్ పిక్చర్స్ నిర్మించింది. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి కళానిధిమారన్ సమీప బంధువు. జయలలితను కించపరిచే విధంగా, ఆమె ప్రవేశపెట్టిన పథకాలను విమర్శించే విధంగా సర్కార్ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని, వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ కూడా అలాగే ఉందని తమిళనాడు మంత్రులు ఆరోపిస్తున్నారు.

వెంటనే ప్రభుత్వాన్ని విమర్శించే సన్నివేశాలు సినిమాలో తొలగించాలని, లేదంటే తాము చర్యలు తీసుకుంటామని సర్కార్ సినిమా యూనిట్ సభ్యులను తమిళనాడు మంత్రులు హెచ్చరించారు. ఈ విషయంపై చిన్నమ్మ వీకే. శశికళ బంధువు, ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడారు.

2003లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు జయలలితను ఉద్దేశించి కోరమరవల్లి అంటూ విమర్శలు చేశారని టీటీవీ దినకరన్ అన్నారు. ఆ సందర్బంలో తనతో మాట్లాడిన జయలలిత తాను ఇంత వరకు కోమరవల్లి అనే పాత్రలో ఎలాంటి సినిమాలో నటించలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను ఆ పేరుతో ఎందుకు విమర్శించారు అంటూ తనతో చర్చించారని టీటీవీ దినకరన్ అన్నారు.

జయలలిత అసలు పేరు కోమరవల్లి కాదని, అన్నాడీఎంకే పార్టీ నేతలు ఇంకా సర్కార్ సినిమా చూసి ఉండరని టీటీవీ దినకరన్ చెప్పారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్న అన్నాడీఎంకే నేతల గురించి ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదని, జయలలితను కించపరిచే సన్నివేశాలు సర్కార్ సినిమాలో లేవని టీటీవీ దినకరన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
TTV Dhinakaran says Komalavalli is not Jayalalitha's original name which is given to a negative charector in Sarkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X