పళనిసామి ప్రభుత్వం పతనం కోసం శత్రుసంహార హోమం, మన్నార్ గుడి పూజలు!

చెన్నై: తనకు ఎదురౌతున్న అడ్డంకులు తొలగిపోవాలని, అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి తనకే రావాలని టీటీవీ దినకరన్ శత్రుసంహార హోమం నిర్వహిస్తున్నారు. శనివారం ఆయన ప్రత్యేక పూజలు, హోమాలు మొదలు పెట్టారు.

తమిళనాడులోని శివగంగై జిల్లాలోని పెరమాలై ఆలయంలో శత్రుసంహార హోమం చేస్తున్న టీటీవీ దినకరన్ పళనిసామి ప్రభుత్వం తన గుప్పిట్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. దినకరన్ వెంట ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఉన్నారు.

 TTV Dinakaran conducted special Shatru Samhara Homa

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో ఉన్న సమయంలో తమిళనాడు రాష్ట్రం మొత్తం అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారని, దేశ, విదేశాల్లో సతైం అమ్మ అభిమానులు పూజలు చేసినా ఫలించలేదని పళనిసామి వర్గంలోని నాయకులు అంటున్నారు.

దినకరన్ ఒక్క హోం చేసి పళనిసామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని చేస్తున్నారని విమర్శించారు. న్యాయం, ధర్మం ఎవరివైపు ఉంటే దేవుడు కూడా వారివైపే ఉంటారని దినకరన్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. శత్రుసంహార హోమం చెయ్యాలని జైల్లో శశికళ సూచించారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+