వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీవీ దినకరన్ కు మళ్లీ కష్టాలు: లంచం ఇవ్వడానికి లక్కీ నెంబర్: కోర్టులో సాక్షాలు !

ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) నాయకుడు టీటీవీ దినకరన్ కు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సినిమా చూపిస్తున్నారు. టీటీవీ దినకరన్ లంచం ఇవ్వడా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) నాయకుడు టీటీవీ దినకరన్ కు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సినిమా చూపిస్తున్నారు. టీటీవీ దినకరన్ లంచం ఇవ్వడానికి కూడా తన లక్కీ నెంబర్ ను కోరుకున్నారని పోలీసులు అంటున్నారు.

<strong>పన్నీర్ సెల్వంకు భీతి: అందుకే ఢిల్లీకి పరుగో పరుగు, మోడీతో భేటీ, కేంద్రం యూటర్న్ !</strong>పన్నీర్ సెల్వంకు భీతి: అందుకే ఢిల్లీకి పరుగో పరుగు, మోడీతో భేటీ, కేంద్రం యూటర్న్ !

టీటీవీ దినకరన్, బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ మాట్లాడుకున్న ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని శనివారం ఢిల్లీలోని తీస్ హజారీ ప్రత్యేక కోర్టులో చెప్పారు. ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వాలని వీరిద్దరూ ఎక్కువగా వాట్సాప్ లో మాట్లాడుకున్నారని పోలీసులు అంటున్నారు.

లక్కీ నెంబర్ ఇదే

లక్కీ నెంబర్ ఇదే

దినకరన్ తన లక్కీ నెంబర్ 5 వచ్చేలాగే (రూ. 50 కోట్లు) ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి పక్కా ప్లాన్ వేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. జోతిష్యులు చెప్పినట్లు దినకరన్ ఎక్కువగా లక్కీ నెంబర్ 5 వచ్చేలాగే అన్నీ ప్లాన్ చేసుకుంటాడని పోలీసులు చెప్పారు.

రెండు రోజులు రాత్రి ఫోన్ లో

రెండు రోజులు రాత్రి ఫోన్ లో

అయితే ఏప్రిల్ 15, 16 తేదీల్లో రాత్రిపూట దినకరన్, సుఖేష్ చంద్రశేఖర్ ఫోన్ లోనే ఎక్కువ సమయం మాట్లాడుకున్నారని, ఆ పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో చెప్పారు. ఈ దెబ్బతో టీటీవీ దినకరన్ కు మళ్లీ కష్టాలు మొదలైనాయి.

పన్నీర్ సెల్వం పంచ్

పన్నీర్ సెల్వం పంచ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శుక్రవారం ఎన్నికల కమిషన్ ను కలిసి మీకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన టీటీవీ దినకరన్ మీద కఠినచర్యలు తీసుకోవాలని, అతను ఏ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

మరుసటి రోజే సినిమా చూపించారు

మరుసటి రోజే సినిమా చూపించారు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో రూ. 89 కోట్ల బట్వాడా చేశారని ఐటీ శాఖ అధికారుల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్ కు చెప్పారు. పన్నీర్ సెల్వం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఈ కేసులో పోలీసులు కోర్టులో సాక్షాలు సమర్పించారు.

మే 29 వరకు చిప్పకూడే గతి

మే 29 వరకు చిప్పకూడే గతి

టీటీవీ దినకరన్, అతని అత్యంత సన్నిహితుడు మల్లికార్జన్, సుఖేష్ చంద్రశేఖర్, హావాల ఆపరేటర్ నతుసింగ్ మే 29వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలని తీస్ హజారీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దినకరన్ మద్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను సోమవారం విచారిస్తామని న్యాయస్థానం చెప్పింది.

English summary
The Delhi Police said they have a recorded phone conversation between Dinakaran and Sukesh to prove the same. Police said the two used to communicate mostly on WhatsApp but on the intervening night of April 15 and 16 this year, they spoke over the phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X